భోళా శంకర్ రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి... ఎన్ని కోట్లు అంటే!

Published : Aug 18, 2023, 12:38 PM IST
భోళా శంకర్ రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి... ఎన్ని కోట్లు అంటే!

సారాంశం

వాల్తేరు వీరయ్య సక్సెస్ నేపథ్యంలో రూ. 65 కోట్లకు రెమ్యునరేషన్ పెంచిన చిరంజీవి, అనిల్ సుంకర వద్ద పైసాతో సహా తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.వాస్తవానికి చిరంజీవి కొంత మేర తన రెమ్యునరేషన్ వదిలేశాడని లేటెస్ట్ టాక్. 

భోళా శంకర్ చిరంజీవికి భారీ షాక్ ఇచ్చింది. ఆయన కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా విషయంలో చిరంజీవి విమర్శలపాలయ్యారు. ఇలాంటి స్క్రిప్ట్ ఆయన ఎంచుకొని ఉండాల్సింది కాదన్న మాట వినిపించింది. చిరంజీవి పెద్ద ఎత్తున ట్రోల్స్ కి గురయ్యాడు. అలాగే నిర్మాత అనిల్ సుంకర కోట్ల రూపాయలు నష్టపోయినప్పటికీ తన రెమ్యునరేషన్ ముక్కుపిండి వసూలు చేశాడన్న అపవాదులు ఎదుర్కొన్నాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ నేపథ్యంలో రూ. 65 కోట్లకు రెమ్యునరేషన్ పెంచిన చిరంజీవి, అనిల్ సుంకర వద్ద పైసాతో సహా తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. 

వాస్తవానికి చిరంజీవి కొంత మేర తన రెమ్యునరేషన్ వదిలేశాడని లేటెస్ట్ టాక్. భోళా శంకర్ విడుదలకు ముందే చిరంజీవి రెమ్యూనరేషన్ చెల్లించిన అనిల్ సుంకర రూ. 10 కోట్లకు మాత్రం చెక్ ఇచ్చాడట. దానిపై పోస్ట్ డేట్ వేశారట. భోళా శంకర్ విడుదలైన రెండు మూడు రోజుల్లో చిరంజీవి ఆ పది కోట్ల చెక్ డ్రా చేసుకునేలా తేదీ వేశారట. ఇక భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకరకు రూ. 50 కోట్లకు పైగా నష్టం మిగిల్చిన నేపథ్యంలో అనిల్ సుంకర ఇచ్చిన రూ. 10 కోట్ల చెక్ చిరంజీవి ప్రజెంట్ చేయలేదట. 

పది కోట్లు విత్ డ్రా చేసుకునే ఆలోచన లేని పక్షంలో ఆయన ఆ మొత్తం వదులుకున్నట్లే అన్నమాట వినిపిస్తుంది. భోళా శంకర్ వరల్డ్ వైడ్ రూ. 79 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు కేవలం రూ. 27 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. దాదాపు భోళా శంకర్ రన్ ముగిసిన నేపథ్యంలో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. 

దర్శకుడు మెహర్ రమేష్ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కించారు. తమిళ్ లో వర్క్ అవుట్ అయిన కథ తెలుగులో అట్టర్ ప్లాప్ అయ్యింది. పదేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన మెహర్ రమేష్ టేకింగ్ ప్రేక్షకులకు నచ్చలేదు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన భోళా శంకర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా తమన్నా నటించింది. కీలకమైన చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే