
సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ గా 'సర్కారు వారి పాట'లో కనిపించాడు. ఆ సినిమా వచ్చి ఏడాది పైనే అయిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' మూవీ చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. ముందుకు వెనక్కి అన్నట్లు కదులుతోంది. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ ఒకరు తర్వాత మరొకరు మారిపోతున్నారు. అంతేకాదు ఈ చిత్రం కథ సైతం త్రివిక్రమ్ మార్చారని వార్తలు వచ్చాయి. ఈ నేపద్యంలో ఈ సినిమా స్టోరీ లైన్ అంటూ ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. అది విన్న ఫ్యాన్స్ కి లేనిపోని సందేహాలు వస్తున్నాయి. అసలు ఆ కథ నిజమేనా అని తెలుసుకునే ముందు..అందేంటో చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రియుల్లో పాపులర్ వెబ్ సైట్ అయిన ఐఎమ్‌డీబీ లో ఈ సినిమా గురించి సినాప్సిస్ కనిపిస్తోంది. ఆ కథనం ప్రకారం మహేష్‌బాబు గుంటూరు డాన్‌గా కనిపించబోతున్నారు.సిటీలో జరిగే అన్యాయాలు అక్రమాలపై పోరాడుతోన్న ఓ జర్నలిస్ట్‌తో మహేష్‌బాబు ప్రేమలో పడతాడని, ఆమె లక్ష్యానికి ఆ డాన్ ఎలా అండగా నిలుస్తాడన్నది ఈ సినిమా కథ అంటూ ఈ సినాప్పిస్‌లో కనిపిస్తోంది? సర్‌ప్రైజ్ ట్విస్ట్‌తో మహేష్‌బాబు క్యారెక్టర్‌ను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లుగా ఇందులోచెప్పారు. అయితే అందులో ఎంతవరకూ నిజముందనేది మాత్రం తెలియదు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమానుహారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తోన్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. మహేశ్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాకముందు 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమరావతికి అటూ ఇటూ' వంటి టైటిళ్లు పరిశీలించిన విషయం తెలిసిందే. చివరకి గుంటూరు కారం టైటిల్ నే ఫైనల్ చేసారు.