నన్ను కలుస్తావా..నీ గర్ల్ ప్రెండ్ ని చంపేయనా? హీరోకు వార్నింగ్

Published : Apr 07, 2019, 06:31 PM IST
నన్ను కలుస్తావా..నీ గర్ల్ ప్రెండ్ ని చంపేయనా? హీరోకు వార్నింగ్

సారాంశం

దుబాయి శీను సినిమాలో ఫైర్ బ్రాండ్ సాల్మన్ రాజు ( ఎమ్. ఎస్ నారాయణ)ని విలన్ సోనూసూద్ కిడ్నాప్ చేస్తాడు. 

దుబాయి శీను సినిమాలో ఫైర్ బ్రాండ్ సాల్మన్ రాజు ( ఎమ్. ఎస్ నారాయణ)ని విలన్ సోనూసూద్ కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు నువ్వు అభిమానం వెర్రితలలు వేసినవాడివిలా ఉన్నావే అంటాడు. ఇప్పుడు వరుణ్ ధావన్ పరిస్దితి అలాగే ఉంది. ఓ మహిళా ఫ్యాన్...అభిమానం వెర్రి తలలు వేసింది. నువ్వు నన్ను కలవకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తా అంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళితే..

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బాలీవుడ్‌ యంగ్  హీరో వరుణ్‌ ధావన్‌ మహిళా అభిమానులకు కొదవలేదు. అలాంటివాళ్లు కొందరు వచ్చి ఆయన్ని కలుస్తూంటారు. అయితే సెట్స్ కు కొందరు వస్తారు. వారిలో చాలా మంది ఆయనతో సెల్ఫీలు దిగుతూంటారు. అయితే కొందరు ఆయన ఉండే నివాశానికి వస్తూంటారు. 

అలాగే ఓ మహిళాభిమాని ఆయన ఇంటి దగ్గర కు వచ్చింది. కలుస్తారా...లేదా అంటూ బెదిరింపులకు దిగింది. ఆమె వరుణ్‌ ధావన్‌ని కలిసేందుకు అతని ఇంటిముందు చాలాసేపు  వేచి చూసింది. ‘కళంక్‌’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న వరుణ్‌ ఇంటికి కాస్త ఆలస్యంగా రావడమే కాక.. అలిసిపోయి ఉన్నానని, కలవటం కుదరదని చెప్పాడు. 

అయితే తనకు అనవసతరం అని, ఇదేమీ పట్టించుకోని సదరు అభిమాని వరుణ్‌ని కలవాల్సిందేనని పట్టుబట్టింది. అయినా సరే  సెక్యూరిటీ వాళ్లు కుదరదని చెప్పటంతో వరుణ్‌ లవర్ నటాషా దలాల్‌ను చంపుతానని వీరంగం సృష్టించింది.  ఆ అల్లరికి వరుణ్‌ ఇంటి వద్ద ఆమెను పంపించడానికి హీరో సెక్యూరిటీ స్టాఫ్ విశ్వ ప్రయత్నం చేసారు. అయినా దాదాపు 45 నిమిషాలపాటు ఆమె వినకుండా రచ్చ రచ్చ చేయడంతో పోలీసులను పిలిపించక తప్పలేదు!

PREV
click me!

Recommended Stories

Malaika Arora Skincare: 52 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న మలైకా.. ఆమె నైట్ స్కిన్‌కేర్ సీక్రెట్ ఇదే!
Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!