పిల్లికి బిచ్చం కూడా వేయలేదు.. నాగబాబుకు ఓటు వేయకండి: శివాజీరాజా కామెంట్స్

Published : Apr 07, 2019, 12:18 PM IST
పిల్లికి బిచ్చం కూడా వేయలేదు.. నాగబాబుకు ఓటు వేయకండి: శివాజీరాజా కామెంట్స్

సారాంశం

  మాజీ మా అధ్యక్షుడు సినీ నటుడు శివాజీ రాజా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ తో వైరల్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఆయనకు ఎవరు ఓటు వేయొద్దని అన్నారు.

మాజీ మా అధ్యక్షుడు సినీ నటుడు శివాజీ రాజా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ తో వైరల్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఆయనకు ఎవరు ఓటు వేయొద్దని అన్నారు.  మెగా ఫ్యామిలీని గతంలో దూషించినవారికి మా ఎన్నికల్లో రాత్రికి రాత్రే సపోర్ట్ చేశారని అయితే ఇప్పుడు వాళ్లే మళ్ళీ మెగా ఫ్యామిలీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాపట్టించుకోవడం లేదని అన్నారు. 

ఈ విషయం బాధగా అనిపించే ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు.  ఇకపోతే మెగా స్టార్ చిరంజీవి తనకు సొంత అన్నయ్య లాంటి వారు అంటూ ఆయన చిన్న తమ్ముడు పవర్ స్టార్ కూడా చాలా మంచి వారని చెప్పారు. అయితే మధ్యలో పుట్టిన నాగబాబు మాత్రం చాలా నెగిటివ్ భావాలున్న వ్యక్తి అని శివాజీ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నరసాపురం నియోజకవర్గం మా ప్రాంతమే అంటూ అక్కడ మంచి రాజకీయ నాయకుడు రావాలని నాగబాబు లాంటి వ్యక్తికి ఓటేస్తే మనం నష్టపోతామని పలు విషయాలను తెలియజేశారు.  

శివాజీరాజా మాట్లాడుతూ..  నాగబాబుకు ఎందుకు ఓటు వేయకూడదు అంటే గతంలో ఆయన మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి వ్యక్తి మా నరసాపురం MP అయితే ఇంతమంది జనాలకు ఏం చేస్తారు. పిల్లికి బిచ్చం కూడా వేయని నాగబాబుకు ఓటేస్తే ఓటు హక్కు వృధా అయినట్లే అని శివాజీరాజా కామెంట్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఆయన మంచి భావాలున్న వ్యక్తి అని శివాజీరాజా వివరణ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?