
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న విడుదల అయిన అర్జున్ రెడ్డి మూవీ చూసి... హీరో విజయ్ దేవరకొండకు ఎవరు ఊహించని బిరుదు ఇచ్చాడు. తెలంగాణ మెగా స్టార్ అని వర్మ బిరుదిచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీపరిశ్రమ నుంచి మొదటి మెగాస్టార్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే అంటున్నాడు వర్మ.
నిన్న విడుదల అయిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చాడు వర్మ. ఓ పక్క ఈ సినిమా ట్రైలర్ చూసి ఫిదా అయిన వర్మ.. పొలిటికల్ లీడర్ వీహెచ్ తోనూ విభేదించి మరీ సోషల్ మీడియాలో ఫైట్ చేశాడడు. దమ్ముంటే కుర్రకారును సినిమాకు రాకుండా చూడాలని సవాల్ చేశారు. అయితే “ఈ తరం హీరోలంతా హీరోయిజం చూపించడానికి స్లో మోషన్ ర్యాంపింగ్ షాట్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఆధారపడుతున్నారు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ పై డిపెండ్ అవ్వకుండా హీరోయిజం చూపించిన మొట్టమొదటి హీరో విజయ్ దేవరకొండ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ.
అంతేకాదు అమితాబ్ బచ్చన్ తర్వాత తనకు విజయ్ దేవరకొండే కనిపిస్తున్నాడు అంటూ యంగ్ అమితాబ్ యంగ్ ఆల్ పాచినోను కలిపితే విజయ్ దేవరకొండ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. ఇది ఇలా ఉండగా నిన్న విడుదల అయిన అర్జున్ రెడ్డి సినిమా నిండా ముద్దుసీన్లే ఉండటంతో యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ‘అర్జున్ రెడ్డి’ కొందరికి అద్భుతంగా అనిపిస్తూ ఉన్నా... ముద్దు సీన్లు ఎక్కువైపోయి కొందరికి భరించలేని విధంగానూ కూడ అనిపిస్తోంది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. అయితే ఈమూవీలోని ప్రతి సన్నివేశం ప్రతి మాటకు యూత్ బాగా కనెక్ట్ అయిపోవడంతో ఈమూవీ మరొక ఊహించని సూపర్ హిట్ మూవీ అన్న టాక్ మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.