
మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి తర్వాత ఆఫర్లు క్యూ కడతాయనుకుంటే... బాహుబలి మాత్రం కలిసి రాలేదని చెప్పాలి. తెలుగు తమిళ భాషల్లో ఏదో అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటున్న ఈ అమ్మడికి నందమూరి హీరో నుండి అనుకోని విధంగా లక్కీ ఛాన్స్ తలుపు తట్టింది. ప్రస్తుతం కళ్యణ్ రాం ఎం.ఎల్.ఏ సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమా పూర్తికాకముందే జయేంద్ర డైరక్షన్ లో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు.
పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మిని అనుకున్నారు. టెస్ట్ షూట్ కూడా చేశాక ఎందుకో అమ్మడిని సినిమా నుండి తప్పించి మిల్కీ బ్యూటీ తమన్నాని ఫైనల్ చేశారట. ఆమె తప్పుకోడానికి కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. అయితే తమన్నా మాత్రం ఈ ఆఫర్ రావడం పట్ల తెగ సంబరపడుతుంది.
తెలుగు తమిళ భాషల్లో ఒకేరకమైన ఇమేజ్ ఉన్న తమన్నా ఈమధ్య ఎందుకో బాగా వెనుకపడ్డది. అందుకే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూస్తుంది. బాహుబలి-2 లో అవంతిక ఎడిటింగ్ లో వెళ్లడంతో బాగా డిసప్పాయింట్ అయిన తమన్నా కళ్యాణ్ రాం ఆఫర్ తో కెరియర్ లో కొత్త జోష్ నింపుకుంటుంది.
రోజుకో హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ సమయంలో స్టార్ రేంజ్ నిలబెట్టుకోవాలంటే అదృష్టం కూడా తోడవ్వాలి. తమన్నాకు ఈ సినిమా ఆఫర్ తన ఫేట్ మార్చుతుందేమో చూడాలి.