విడాకుల కేసు రద్దు చేసుకున్న కన్నడ స్టార్ సుదీప్

First Published Aug 26, 2017, 11:10 AM IST
Highlights
  • విడాకుల కేసు వెనక్కి తీసుకున్న కన్నడ స్టార్ సుదీప్
  • సుదీప్ తన కూతురు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • విడాకులు వద్దని భార్య భర్తలు ఇద్దరు చెప్పడంతో కేసు కొట్టేసిన కోర్టు 

కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, ప్రియ సుదీప్ లు మనస్పర్థల కారణంగా కోర్టుకు విడాకులు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెలెబ్రిటీ కపుల్ తమ కూతురు కోసం తాము కలిసే వుండాలని నిర్ణయించుకున్నామని, విడాకులు వద్దని కోర్టుకు తెలిపారు. దీంతో వాళ్ల విడాకుల అభ్యర్థనను కోర్టు కొట్టేసింది.

 

సాధారణంగా ఎవరైనా విడిపోతూ ఉంటె వారు తిరిగి కలవాలి అనే అందరి ప్రార్ధనలూ ఉంటాయి. అయితే అవా చాలా కేసుల్లో ప్రార్థనలుగానే మిగిలిపోతాయి. కానీ ఆ ప్రార్ధనలే కన్నడ హీరో సుదీప్ విషయం లో వర్క్ అయినట్టు తెలుస్తోంది.

 

 

తన భార్య కి విడాకులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న కన్నడ నటుడు సుదీప్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు. పెళ్లి అయిన 14 వ సంవత్సరం లో సుదీప్ విడాకులు కావాలి అంటూ 2015 లో హై కోర్టు ని ఆశ్రయించాడు.

 

నిత్యా మీనన్ తో ఇతనికి ఉన్న అఫైర్ కారణంగానే భార్యని వదిలెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు అనే వార్తలు కూడా వినిపించాయి .. కానీ అవన్నీ పుకర్లే అని ఎప్పటికప్పుడు నిత్య, సుదీప్ కొట్టి పారేస్తూ ఉన్నారు. తాజాగా అతను తమ కూతురు సాన్వి కోసం మ‌ళ్లీ క‌ల‌వాల‌ని ప్ర‌స్తుతం సుదీప్ దంప‌తులు మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల‌ పిటిషన్‌ను కూడా వారిరువురూ వెనక్కి తీసుకున్నారు. సుదీప్ తరఫున ఉన్న న్యాయవాదులు బెంగళూరు ఫామిలీ కోర్టు లో ఈ విషయం చెప్పి మీడియా కి కూడా వివరించారు.

click me!