కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి బయటకి గెంటేశాడు.. సీనియర్ నటుడిపై కూతురు ఫిర్యాదు!

Published : Sep 22, 2018, 11:24 AM IST
కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి బయటకి గెంటేశాడు.. సీనియర్ నటుడిపై కూతురు ఫిర్యాదు!

సారాంశం

నటుడు విజయ్ కుమార్ తన కూతురు వనిత సినిమా షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకొని ఆక్రమించిందని, అడగడానికి వెళ్తే కిరాయి మనుషులతో బెదిరించిందని మధురవాయిల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. 

నటుడు విజయ్ కుమార్ తన కూతురు వనిత సినిమా షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకొని ఆక్రమించిందని, అడగడానికి వెళ్తే కిరాయి మనుషులతో బెదిరించిందని మధురవాయిల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను విచారించగా.. ఇంట్లో తనకు కూడా వాటా ఇవ్వాలని వారితో కూడా వాగ్వాదానికి దిగింది. తన అనుచరులతో పోలీసులపై కూడా దాడి చేసింది. దీంతో పోలీసులు వనితతో పాటు ఆమె మనుషులు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే వారిలో వనిత పరారైంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్న సమయంలో గురువారం రాత్రి వడపళని పోలీస్ స్టేషన్ కి వచ్చిన వనిత తన తండ్రిపై ఫిర్యాదు చేసింది.

తన తండ్రే కిరాయి మనుషులతో తనను కొట్టిస్తున్నాడని, ఇంటి నుండి గెంటేశాడని ఆరోపణలు చేసింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ''నేను నా తల్లి దగ్గరేఉన్నాను . నా తండ్రి నన్ను ఇంట్లో ఉండకూడదని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సినిమా వాళ్లకి బయట ఇల్లు ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదు.

అలాంటప్పుడు నేను ఎక్కడ ఉండాలి..? అందుకే మా అమ్మ ఇంటికి వచ్చాను. నా తండ్రి నన్ను కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇంటి నుండి బయటకి గెంటేశాడు'' అని చెప్పి వాపోయింది.  

సంబంధిత వార్త..

నా కూతురు రౌడీలతో బెదిరిస్తోంది.. సీనియర్ నటుడు

PREV
click me!

Recommended Stories

నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?
డేటింగ్ యాప్ లో మొదటి అనుభవం, అతడితో 8 గంటలు గడిపా.. నటి బోల్డ్ కామెంట్స్ వైరల్