ప్రణయ్ హత్యపై వర్మ సినిమా..?

Published : Sep 22, 2018, 11:04 AM ISTUpdated : Sep 22, 2018, 11:06 AM IST
ప్రణయ్ హత్యపై వర్మ సినిమా..?

సారాంశం

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రణయ్ హత్యపై స్పందిస్తూ పరువు హత్యకి కొత్త అర్ధం చెప్పారు. అమృత తండ్రి మారుతిరావు పిరికి క్రిమినల్ గా అభివర్ణించారు వర్మ. 

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రణయ్ హత్యపై స్పందిస్తూ పరువు హత్యకి కొత్త అర్ధం చెప్పారు. అమృత తండ్రి మారుతిరావు పిరికి క్రిమినల్ గా అభివర్ణించారు వర్మ. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటనపై సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది స్పందించారు. దర్శకుడు వర్మ కూడా తనదైన రీతిలో ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుండి భారీ స్పందన వస్తోంది.

ప్రణయ్ హత్యోదంతంపై సినిమా చేయాలంటూ కొందరు నెటిజన్లు వర్మని కోరగా.. మరికొందరు మాత్రం ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాం..? వర్మా.. నెక్స్ట్ సినిమా పేరు మిర్యాలగూడలో మర్డరా..? అంటూ విమర్శిస్తున్నారు. వీళ్ల కామెంట్లు సంగతేమో కానీ నిజంగా వర్మ సినిమా చేయాలనుకుంటే మాత్రం ఈ కథ ఆయనకి కావాల్సినంత హైప్ ని తీసుకొస్తుంది.

పైగా ఇలాంటి ఇష్యూపై వర్మ లాంటి డైరెక్టర్ సైలెంట్ గా ఉండడం కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏ నిమిషంలోనైనా.. వర్మ నుండి పరువు హత్య కాన్సెప్ట్ తో సినిమా ప్రకటన వచ్చినా రావొచ్చు! 

సంబంధిత వార్త..

అది పరువుహత్యే అయితే మారుతీరావు బతకొద్దు.. వర్మ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?