పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండకూడదు.. సంపూపై వెన్నెల కిషోర్ కామెంట్!

By Udayavani DhuliFirst Published 22, Sep 2018, 10:42 AM IST
Highlights

'హృదయ కాలేయం' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు ఆ తరువాత తన కామెడీ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. చాలాకాలంగా ఆయన 'కొబ్బరిమట్ట' అనే సినిమాలో నటిస్తున్నాడు.

'హృదయ కాలేయం' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు ఆ తరువాత తన కామెడీ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. చాలాకాలంగా ఆయన 'కొబ్బరిమట్ట' అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకుసిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. సాధారణంగానే సంపూర్ణేష్ బాబు సినిమాలంటే కాస్త అతి ఎక్కువగా ఉంటుంది. తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమోలో ఈ అతి కాస్త ఎక్కువైంది.

అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని అతిగా చూపిస్తూ ఈ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇది చూసిన కమెడియన్ వెన్నెల కిషోర్ ఇలాంటి అన్నయ్య పగవాడికి కూడా ఉండకూడదని ట్వీట్ చేశారు.

''సంప్రదాయ విలువలతో అద్భుతమైన లిరిక్స్‌తో ఒక ఘాటైన సందేశం ఇస్తూ గుండెకి లోతైన గాయం చేసే ఒక సంపూర్ణమైన గేయం'' అంటూ ట్వీట్ చేస్తూ సంపూర్ణేష్ ఆన్ ఫైర్, సాయి రాజేష్ అన్నా మీకో నమస్కారం అంటూ ప్రొడ్యూసర్ కి దండం పెట్టారు.

Last Updated 22, Sep 2018, 10:42 AM IST