వాణి జయరాం మరణం: పని మనిషి ఏం చెప్పిందంటే...

Published : Feb 04, 2023, 04:36 PM IST
వాణి జయరాం మరణం: పని మనిషి ఏం చెప్పిందంటే...

సారాంశం

ప్రముఖ గాయని వాణి జయరాం మరణంతో అందరిని షాక్‌కి గురి చేస్తుంది. అయితే ఆమె గాయాలతో మరణించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. తాజాగా ఈ ఘటనపై ఆమె పనిమనిషి స్పందించారు. 

నేపథ్య గాయని వాణి జయరాం మరణం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఓవైపు ఆమె హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుండగా, మరోవైపు ఆమె గాయాలతో కన్నుమూయడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆమె కింద పడి మరణించారా? లేక ఎవరైనా దాడి చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాణీ జయరాం ఇంటికి(చెన్నైలోని) సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే వాణీ జయరాం మరణంపై ఆమె ఇంటి పనిమనిషి స్పందించారు. గాయనీ ఎలా చనిపోయిందనే విషయాలను తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ, `నేను పదేళ్లుగా వాణీ జయరాం ఇంటి పనిమనిషిగా వర్క్ చేస్తున్నాను. ఆమె ఇంట్లో చాలా కాలంగా ఒంటరిగానే ఉంటుంది. ఎప్పటిలాగే తాను ఈ రోజు(శనివారం) ఉదయం 10.45గంటల సమయంలో ఇంటికి వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టాను. ఐదుసార్లు కొట్టినా డోర్‌ తెరవలేదు. ఫోన్‌ కూడా చేశా, అయినా ఫోన్‌ లిఫ్ట్ చేయలేదు. దీంతో నా భర్తకి సమాచారం అందించాను. 

కాలింగ్‌ బెల్‌ కొట్టినా డోర్‌ తీయకపోవడం, కాల్‌ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కింద ఉన్న వారందరికి విషయం చెప్పాను. అందరం కలిసి పోలీసులకు సమాచారం అందించాం. పద్మ అవార్డులు ప్రకటించినప్పట్నుంచి ఆమెకి అభినందనలు చెబుతూనే ఉన్నారు. వాణీగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకోవడం లేదు. కానీ ఒక్కసారిగా ఆమె నుదుటిపై గాయాలతో కనిపించడం షాక్‌ అయ్యాం` అని వెల్లడించారు. ప్రస్తుతం వాణి జయరాం భౌతిక కాయాన్ని పోలీసులు ఎగ్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

దీంతో ఏం జరిగిందనేది ఉత్కంఠకి గురి చేస్తుంది. పోలీసులు వాణీ జయరాం ఆస్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. మరణానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ వాణీ మరణంతో వారి అభిమానులు, సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్