బ్రేకింగ్: 'వాల్మీకి' పేరు మారింది.. కొత్త టైటిల్ ఏంటంటే..?

Published : Sep 19, 2019, 10:31 PM ISTUpdated : Sep 19, 2019, 10:38 PM IST
బ్రేకింగ్: 'వాల్మీకి' పేరు మారింది.. కొత్త టైటిల్ ఏంటంటే..?

సారాంశం

గత కొంతకాలంగా బోయ సామాజిక వర్గం నుండి ఎదురవుతోన్న ఆందోళన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి అని ఆ పాత్రను నెగిటివ్ చూపించడంపై బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన 'వాల్మీకి' సినిమా టైటిల్ విషయంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా పేరుని 'గద్దలకొండ గణేష్'గా మార్చింది. గత కొంతకాలంగా బోయ సామాజిక వర్గం నుండి ఎదురవుతోన్న ఆందోళన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి అని ఆ పాత్రను నెగిటివ్ చూపించడంపై బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టైటిల్ మార్చాలంటూ బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై చిత్రబృందానికి, వరుణ్ తేజ్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో సినిమా పేరు మారుస్తున్నట్లుయూనిట్ కోర్టుకి తెలియజేసింది. 'వాల్మీకి' పేరుని 'గద్దలకొండ గణేష్' గా మారుస్తామని వెల్లడించింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర పేరే 'గద్దలకొండ గణేష్'.

అదే పేరుని టైటిల్ గా అనౌన్స్ చేశారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ చిత్రం జిగర్తాండ కు రీమేక్ గా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. 


సెన్సార్ కు విలువ లేదా.. రెండు జిల్లాల్లో వాల్మీకి రిలీజ్ నో, ఫ్యాన్స్ రియాక్షన్!

బ్రేకింగ్: 'వాల్మీకి'కి షాక్.. ఆ రెండు జిల్లాల్లో రిలీజ్ ఆపేసిన పోలీసులు

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే