సెన్సార్ కు విలువ లేదా.. రెండు జిల్లాల్లో వాల్మీకి రిలీజ్ నో, ఫ్యాన్స్ రియాక్షన్!

Published : Sep 19, 2019, 08:52 PM IST
సెన్సార్ కు విలువ లేదా.. రెండు జిల్లాల్లో వాల్మీకి రిలీజ్ నో, ఫ్యాన్స్ రియాక్షన్!

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రోజు విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే వాల్మీకి చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్ర విడుదలని అడ్డుకుంటూ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. 

దీనితో ఈ రెండు జిల్లాలో వాల్మీకి చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. వాల్మీకి టైటిల్ పై బోయ, వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో భద్రతా కారణాల రీత్యా ఆ రెండు జిల్లాలో విడుదలకు బ్రేక్ పడింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సినిమా చూడదగిందా కదా అనే నిర్ణయం తీసుకోవాల్సింది సెన్సార్. వాల్మీకి చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. అలాంటి చిత్రాన్ని కలెక్టర్లు అడ్డుకోవడం ఏంటని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. 

సినిమా కంటెంట్ చూసి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో కొందరు నిరసన తెలుపుతున్నారని ఏకంగా విడుదలనే అడ్డుకోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వరుణ్ తేజ్, హరీష్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రానికి మద్దతు తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?