హిందీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది.
దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీలాంచ్ అయ్యారు.సూపర్ హిట్ కొట్టాటరు. భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ తో బ్రేక్ పడింది. గత రెండు నెలలుగా థియోటర్స్ అన్ని మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గటంతో రీఓపెన్ అవుతున్నాయి.వైజాగ్ జగదాంబ థియోటర్ ని క్రాక్ సినిమాతో ఓపెన్ చేసారు. అలాగే ఇప్పుడు మరిన్ని థియోటర్లు ఓపెన్ కానున్నాయి. అయితే చెప్పుకోదగ్గ రిలీజ్ సినిమాలు అయితే రిలీజ్ కు లేవు. దాంతో వకీల్ సాబ్ సినిమాపై అందరి దృష్టీ పడింది.
జూలై రెండవ వారం నుంచి మూడు వందల థియోటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించినట్లు సమాచారం. 50 పర్శంట్ ఆక్యుపెన్సీతో తెలంగాణా,ఆంధ్రా థియోటర్స్ ఓపెన్ కానున్నాయి. మరో ప్రక్క ఏప్రియల్ నుంచి అమేజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ అవుతోంది.దాంతో చాలా మంది ఈ సినిమాని ఓటీటిలో చూసేసి ఉంటారు కదా..ఇంక థియేటర్లలో ఎవరు చూస్తారనే సందేహం కొందమంది వ్యక్తం చేస్తున్నా దిల్ రాజు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం.
ఇక హిందీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన నంద పాత్ర సినిమాకు మరో హైలైట్ అనే చెప్పాలి.