
బాలీవుడ్ నటుడు నవతేజ్ హుందాల్ సోమవారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ముంబైలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆఖరిగా నటించిన చిత్రం 'URI'.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నవతేజ్ హోం మంత్రి పాత్రలో కనిపించారు. ఆయన మృతి పట్ల సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. నవతేజ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది.
నవతేజ్ కి భార్య అవంతిక, ఇద్దరుకూతుర్లు ఉన్నారు. 1993లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం 'ఖల్‌నాయక్', 1996లో వచ్చిన 'తేరే మేరే సప్నే', 2009 లో 'ది విస్పరర్స్' వంటి చిత్రాల్లో నవ్‌తేజ్ నటించారు.