ఆ హీరోయిన్ ని ప్రేమిస్తున్నానని ఓపెన్ గా చెప్పిన ఉప్పెన వైష్ణవ్!

Published : Jun 12, 2021, 08:41 AM IST
ఆ హీరోయిన్ ని ప్రేమిస్తున్నానని ఓపెన్ గా చెప్పిన ఉప్పెన వైష్ణవ్!

సారాంశం

వైష్ణవ్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. యూత్ లో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న వైష్ణవ్ తన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

మొదటి సినిమాతోనే ఔరా అనిపించాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఆయన నటించిన ఉప్పెన మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో వైష్ణవ్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. యూత్ లో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న వైష్ణవ్ తన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ యువ హీరో ఫేవరేట్ హీరో రజినీకాంత్ అట. ఆయన నటించిన శివాజీ చిత్రాన్ని చాలాసార్లు చూశానని చెప్పాడు. 


ఇక వైష్ణవ్ ఫేవరేట్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అట. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమ అంటూ ఆమెపై  తనకున్న అపరిమిత ప్రేమను రివీల్ చేశాడు వైష్ణవ్. బాలీవుడ్ లో అనుకున్నంత సక్సెస్ కానీ సోనాక్షి దబాంగ్ తో పాటు కొన్ని చిత్రాలలో మంచి నటన కనబరిచారు. ఇక సమంత గురించి వైష్ణవ్ ని అడుగగా... ది ఫ్యామిలీ మాన్ 2లో సమంత నటన తనకు ఎంతగానో నచ్చేసింది అన్నారు. 


ఉప్పెన చిత్రంలో తనతో జతకట్టిన కృతి శెట్టిలో దాగిన మరో టాలెంట్ ఏమిటో కూడా రివీల్ చేశాడు వైష్ణవ్. కృతి శెట్టి మంచి సింగర్ కూడా అంటూ మనకు తెలియని తనలోని టాలెంట్ బయటపెట్టారు. ఇక తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. దాని తరువాత గిరీశాయ దర్శకత్వంలో మరో చిత్రం చేయాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?