'జెర్సీ' నటి బాడిపై కామెంట్స్...సూపర్ కౌంటర్

Surya Prakash   | Asianet News
Published : Jun 12, 2021, 07:32 AM IST
'జెర్సీ' నటి బాడిపై కామెంట్స్...సూపర్ కౌంటర్

సారాంశం

ఈ మధ్యన ఆమె శరీర బరువు పెరిగిందని ఆమెను కొందరు ట్రోల్ చేయటం మొదలెట్టటారు. వారికి  ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా చేసిన అమ్మాయి గుర్తుందా? ఆమే ఆ తర్వాత జీనియస్ సినిమాలోనూ, రీసెంట్ట గా వచ్చిన నాని  జెర్సీ సినిమాలోనూ చేసింది. జెర్సీలో  జర్నలిస్ట్ రమ్య పాత్రలో కనిపించి అందరి దృష్టిలో పడింది. ఈ మళయాళి ఆర్టిస్ట్ పేరు పేరే సానుష సంతోష్. ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి,ఇప్పుడిప్పుడే  పాపులర్ అవుతోంది. మలయాళం, తమిళంలో కలిపి దాదాపు 20 సినిమాలకు పైగా నటించింది సానుష. ఇక సోషల్ మీడియాలో సానుషకు మంచి పాపులారిటీ ఉంది. అయితే అక్కడ సెలబ్రెటీలకు కొన్ని సమస్యలు తప్పటం లేదు. ఈ మధ్యన ఆమె శరీర బరువు పెరిగిందని ఆమెను కొందరు ట్రోల్ చేయటం మొదలెట్టటారు. వారికి  ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.

 సానుష రిప్లై ఇస్తూ.... “నా కన్నా నా బరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న అందరికీ, జీవితం అంటే సన్నగా, అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. వేరొకరి శరీరం గురించి కామెంట్ చేసేటప్పుడు గుర్తించుకోండి. రెండు వేళ్ళు వేరే వాళ్ళవైపు చూపిస్తే మూడు వేళ్ళు మీకే చూపిస్తాయి” అని కౌంటర్ ఇచ్చింది. 

ఆమె కౌంటర్ కు మంచి స్పందనే వస్తోంది. చాలా మంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బేబీ సానుష ఫ్యాన్స్ ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. వేరే వాళ్ల జీవితంలోకి తొంగి చూసి కామెంట్స్ చేసే వారికి ఆమె  బాగా బుద్ది చెప్పిందని చెప్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే