నా మంచి కోరేవారు ఎల్లప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలిః బాలయ్య

By Aithagoni RajuFirst Published Jun 11, 2021, 6:54 PM IST
Highlights

 బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల విషెస్‌తో సోషల్‌ మీడియా షేక్‌ అయ్యింది.ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వెల్‌ విషర్స్ కి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ.

నందమూరి బాలకృష్ణ నిన్న(గురువారం) తన 61వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కరోనా కారణంగా నిరాఢంబరంగా ఆయన బర్త్ డే వేడుకలు జరిగాయి. ప్రధానంగా బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చిన్నారులు, వైద్య సిబ్బంది, రోగుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు.  బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల విషెస్‌తో సోషల్‌ మీడియా షేక్‌ అయ్యింది. మరోవైపు బాలయ్య అరుదైన ఫోటోలు వైరల్‌గా మారాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వెల్‌ విషర్స్ కి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. ఫేస్‌ బుక్‌ వేదికగా ఓ నోట్‌ని పంచుకున్నారు. `నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మీయులకు, సినీ కళాకారులకు, సహచరులకు, కార్యకర్తలకు, హిందూపురం ప్రజలకు, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ నలుదిక్కుల ఉన్న నా అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు నా మంచిని కోరే మీరు ఎల్లప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలని, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నా` అని తెలిపారు బాలయ్య. 

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు బర్త్ డే రోజున గోపీచంద్‌ మలినేనితో చేయబోతున్న సినిమా `ఎన్‌బీకే 107`ని కూడా ప్రకటించారు. 

click me!