ఫొటో టాక్: కసిగా కనిపిస్తోన్న ఉపేంద్ర

First Published 25, Sep 2018, 7:42 PM IST
Highlights

లవ్ లోనే హార్డ్ రొమాంటిక్ ని అందరికంటే ముందే ట్రై చేశాడు.  అతని మార్క్ సినిమాల గురించి కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్న వారు కూడా తెగ వర్ణిస్తారు. ఓం -  A  - ఉపేంద్ర సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే చాలా రోజుల తరువాత ఈ వెరైటీ హీరో మరో కొత్త రకం రసికుడిగా కనిపిస్తున్నాడు. 

కన్నడ హీరో ఉపేందర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవ్ లోనే హార్డ్ రొమాంటిక్ ని అందరికంటే ముందే ట్రై చేశాడు.  అతని మార్క్ సినిమాల గురించి కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్న వారు కూడా తెగ వర్ణిస్తారు. ఓం -  A  - ఉపేంద్ర సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే చాలా రోజుల తరువాత ఈ వెరైటీ హీరో మరో కొత్త రకం రసికుడిగా కనిపిస్తున్నాడు. 

ఐ లవ్ యూ అనే సున్నితమైన టైటిల్ తో హార్డ్ హిట్టింగ్ రొమాంటిక్ సినిమాను వదలబోతున్నాడు. కన్నడతో పాటు తెలుగులో కూడా తెరకెక్కుతున్న ఈ బై లింగువల్ సినిమాను చంద్రు దర్శకత్వం వహించాడు. ముందుగానే చిత్ర యూనిట్ ఉపేంద్ర మార్క్ కి తగ్గటుగా ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. 

చాలా కసితో ఉన్న వ్యక్తిగా ఉపేంద్ర ఒక బెడ్ పై అర్ధనగ్నంతో దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజా పువ్వును నోటితో కరచుకొని ఇచ్చిన పోజును చూస్తుంటే ఉపేంద్ర పెద్ద ప్రయోగమేదో చేస్తున్నాడని కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఆ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Last Updated 25, Sep 2018, 7:42 PM IST