తెలుగులో వస్తోన్న బాలీవుడ్ బడా మూవీ!

Published : Sep 25, 2018, 06:36 PM ISTUpdated : Sep 25, 2018, 06:45 PM IST
తెలుగులో వస్తోన్న బాలీవుడ్ బడా మూవీ!

సారాంశం

దంగల్ సినిమాతో ఇండియన్ సినిమాను పరదేశీయులకు కూడా పరిచయం చేసిన అమిర్ తన నెక్స్ట్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది నవంబర్ లో దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు

ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను ఎప్పటికప్పుడు మార్చేసే కథానాయకుడు అమిర్ ఖాన్. అమిర్ చేసే ప్రతిసినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉంటుందని సినిమా పోస్టర్ లోనే అర్ధమవుతుంది. దంగల్ సినిమాతో ఇండియన్ సినిమాను పరదేశీయులకు కూడా పరిచయం చేసిన అమిర్ తన నెక్స్ట్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఈ ఏడాది నవంబర్ లో దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపోతే తెలుగులో కూడా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ను స్పెషల్ గా డబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో దంగల్ ని అనువదించినప్పుడు మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ హిస్టారికల్ మూవీని కూడా తెలుగులో డబ్ చేసి రెండు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. 

దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమాను నిర్మిస్తోంది.విజయ్ కృష్ణ ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  అమిర్ ఖాన్ తో పాటు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ - కత్రినా కైఫ్ సినిమాలో నటించారు.  

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది