దేవదాస్ హిట్టయితే మనోడి రేంజ్ మారినట్టే!

By Prashanth MFirst Published Sep 25, 2018, 7:18 PM IST
Highlights

నేటితరం యువకులు ఆ ఫార్మాట్ ని చేంజ్ చేస్తున్నారు. యువ దర్శకుల లిస్ట్ టాలీవుడ్ లో ఈ మధ్య పెరుగుతుండం ప్రశంసించాల్సిన విషయం. అలాంటి వారిలో శ్రీ రామ్ ఆదిత్య ఒకరు. అయితే ఈ దర్శకుడికి ఇప్పుడు అతి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. శమంతకమణి సినిమాతో మినీ మల్టీస్టారర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ రామ్ అశ్విని దత్ - నానికి దేవ దాస్ కథ చెప్పి మెప్పించాడు. 

సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఏళ్ల తరబడి సహాయ దర్శకుడిగా పనిచేస్తే గాని యాక్షన్ చెప్పే అవకాశం రావడం లేదు. అయితే నేటితరం యువకులు ఆ ఫార్మాట్ ని చేంజ్ చేస్తున్నారు.   యువ దర్శకుల లిస్ట్ టాలీవుడ్ లో ఈ మధ్య పెరుగుతుండం ప్రశంసించాల్సిన విషయం. అలాంటి వారిలో శ్రీ రామ్ ఆదిత్య ఒకరు. అయితే ఈ దర్శకుడికి ఇప్పుడు అతి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. 

శమంతకమణి సినిమాతో మినీ మల్టీస్టారర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ రామ్ అశ్విని దత్ - నానికి దేవ దాస్ కథ చెప్పి మెప్పించాడు. వారితో పాటు నాగార్జున కూడా కలవడంతో సినిమా స్థాయి పెరిగింది. ఫైనల్ గా సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తరువాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో బాక్స్ ఆఫీస్ పై అంచనాలు పెరిగాయి. శ్రీ రామ్ ఈ ఆదిత్య ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకున్నాడనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది. 

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మనోడి పేరు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతుంది. ఇక స్టార్ హీరోలు కూడా యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇష్టపడతారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒక ఫ్రెమ్ లో ఈక్వల్ గా సెట్ చేయడమనేది చాలా కష్టంతో కూడుకున్నది.  ఎవరిని తక్కువగా చూపించిన ముందుగా ఫ్యాన్స్ హార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి శ్రీరామ్ ఎలా చూపించాడో చూడాలి. సినిమా హిట్ అయితే భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ కథలు వస్తాయని చెప్పవచ్చు. 

click me!