
దగ్గుబాటు రానాకి కంటికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ కాస్త శరీరంలో కొన్ని భాగాలపై పడింది. దీని కారణంగా అతడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని అనుకున్నారు.
ఈ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని మీడియా హౌసెస్ కి విషయం లీక్ కావడంతో రానా ఆరోగ్య పరిస్థితి వార్తల్లో నిలిచింది. కిడ్నీ ఇవ్వడానికి డోనార్ కూడా దొరికారని త్వరలోనే ఆపరేషన్ జరుగుతుందని అన్నారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అతడికి కిడ్నీ సమస్య ఉన్నప్పటికీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ మాత్రం చేయడం లేదట. కొందరు డాక్టర్ల బృందం ప్రత్యేకంగా రానా ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారట. మెడికేషన్ ద్వారానే రానా ఆరోగ్యాన్ని సరి చేయవచ్చని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
'బాహుబలి' సినిమా కోసం ఎక్కువ మొత్తం బరువు పెరగడం కూడా రానా ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రానా స్మోకింగ్ కూడా వదిలేసినట్లు సమాచారం. తన దృష్టి మొత్తం ఆరోగ్యం, సినిమాల మీదనే పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ఏడాదిలో రానా నటిస్తోన్న '1945', 'హతి మేరే సాతి' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.