శ్రీదేవి కూతురు.. పర్ఫెక్ట్ కార్గిల్ గర్ల్!

Published : Feb 26, 2019, 02:51 PM IST
శ్రీదేవి కూతురు.. పర్ఫెక్ట్ కార్గిల్ గర్ల్!

సారాంశం

కార్గిల్ యుద్ధం గురించి పాకిస్థాన్ - భారత్ జనాలు అస్సలు మరచిపోలేరు. ప్రపంచ దేశాలను షాక్ కి గురి చేసిన ఆ వార్ పై ఒక సినిమా వస్తోంది అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అందాల సుందరి శ్రీదేవి కూతురు కూడా అలాంటి హిస్టారికల్ కథలో నటిస్తోంది. 

యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళ పైలెట్ గుంజన సక్సేనా జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సక్సెనా పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పర్ఫెక్ట్ కార్గిల్ గర్ల్ గా కనిపించడానికి సినిమా కోసం జాన్వీ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. 

ఇకపోతే సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ఇటీవల ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కార్గిల్ యుద్ధంలో గుంజన పాల్గొన్నారు. కావున కార్గిల్ గర్ల్ అనే టైటిల్ అయితే బావుంటుందని దర్శకుడు శరన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది;. త్వరలోనే సినిమాకు సంబందించిన టీజర్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయాలనీ కార్గిల్ గ్యాంగ్ రెడీ అవుతోంది.    

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?