కౌశల్ ఆర్మీ ఆరోపణలపై కౌశల్ రెస్పాన్స్!

Published : Feb 26, 2019, 02:44 PM IST
కౌశల్ ఆర్మీ ఆరోపణలపై కౌశల్ రెస్పాన్స్!

సారాంశం

ఓ పక్క ఇండియా మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేప్పట్టిన సర్జికల్ స్ట్రైక్ మీద దృష్టి పెడితే బిగ్ బాస్ ఫేం కౌశల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఓ పక్క ఇండియా మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేప్పట్టిన సర్జికల్ స్ట్రైక్ మీద దృష్టి పెడితే బిగ్ బాస్ ఫేం కౌశల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న ఓ టీవీ ఛానెల్ లో కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు కౌశల్ పై చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.

కౌశల్ డబ్బు మనిషని, బయటకి కనిపించేది అతడి అసలు స్వరూపం కాదని, కౌశల్ ఆర్మీ సభ్యులను బలిపశువులను చేశాడని చాలా ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ని కూడా కౌశల్ తిట్టినట్లు చెప్పారు. అయితే వీటిపై స్పందించాడు కౌశల్. కొద్దిరోజులుగా అతడిపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు. ఇటువంటి చెత్తపై మాట్లాడే ఇంటరెస్ట్ కూడా తనకు లేదని, ఇలాంటి నిరాధారమైన విషయాలపై స్పందిస్తూ పోతే తనను మరింత తగ్గించాలని చూస్తారని అన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో నేనెలా ఉన్నానో.. నిజ జీవితంలో కూడా అంతే అని చెప్పారు.

ఎవరో కొందరు చేసే ఆరోపణలు తన స్థాయిని తగ్గించలేవని అన్నారు. కాలం గడిచే కొద్ది అన్ని విషయాలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. కౌశల్ చేసిన ఈ కామెంట్స్ కి కూడా సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎదురవుతోంది. ఇక నీ పనైపోయిందని కొందరు అంటుంటే.. మరికొందరు కౌశల్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. 

కౌశల్ కి షాక్.. రివర్స్ అయిన కౌశల్ ఆర్మీ! 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం