పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదరుచూస్తున్నారు. దీంతో నెక్ట్స్ రాబోయే టీజర్ పై నిర్మాత అదిరిపోయే అప్డేట్ అందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తోంది.
ఈ క్రమంలో రీసెంట్ గా షూటింగ్ పనులు చకాచకా కొనసాగుతున్నట్టు అప్డేట్ అందిస్తూ వచ్చారు. గతంలో గ్లింప్స్, పోస్టర్లు విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా చిత్రంపై మరో అదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత ఏఎం రత్నం. ఈ రిపబ్లిక్ డే (జనవరి 26)న ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ అందించబోతున్నట్టు తెలిపారు. హరిహార వీరమల్లు నుంచి పవర్ ఫుల్ టీజర్ రాబోతుందని వెల్లడించారు. దీనిపైనా అఫిషియల్ అప్డేట్ అందుతుందన్నారు. ఇక త్వరలోనే టీజర్ అప్డేట్ రానుందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2’షోకు సంబంధించిన బాలయ్య - పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిన్న రాత్రి విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ఇక బాలయ్య పవన్ కళ్యాణ్ ను అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. వాటిని పవర్ స్టార్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది హాట్ టాపిక్. ఇక ‘హరి హర వీరమల్లు’లో తెలుగు బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నటిస్తోంది. ఆదిత్య మీనన్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, పూజితా పొన్నాడ ఆయా పాత్రల్లో అలరించనున్నారు.
17వ శతాబ్దంలోని మొఘల్ కాలంగా సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
.’s new teaser likely to be released on Jan 26 🔥 pic.twitter.com/PP6ie9bfEW
— Haricharan Pudipeddi (@pudiharicharan)