పవన్‌ కళ్యాణ్‌తో సినిమాపై గోపీచంద్‌ మలినేని క్లారిటీ.. సినిమా ఎలా ఉండబోతుందంటే?

Published : Jan 21, 2023, 01:57 PM IST
పవన్‌ కళ్యాణ్‌తో సినిమాపై గోపీచంద్‌ మలినేని క్లారిటీ.. సినిమా ఎలా ఉండబోతుందంటే?

సారాంశం

`వీరసింహారెడ్డి`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని.. పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని దర్శకుడు కన్ఫమ్‌ చేశారు. 

ఇటీవల `వీరసింహారెడ్డి`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. బాలకృష్ణని వింటేజ్‌ లుక్‌లో చూపించి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. బాలయ్య స్టయిల్‌ అదరహో అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఫ్యాన్స్ ఊగిపోయారంటే అతిశయోక్తి కాదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 120కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. 

ఈ సినిమా తర్వాత గోపీచంద్‌మలినేని ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. నెక్ట్స్ ఎవరితో అనేది సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై గోపీచంద్‌మలినేని స్పందించారు. పవన్‌ తో సినిమా చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. పవన్‌తో సినిమా చేయాల్సి ఉందని చెప్పారు. 

తనకు ఇష్టమైన వారు ఇద్దరు ఉన్నారని, అందులో ఒకరు బాలయ్య, రెండు పవన్ కళ్యాణ్‌ అని చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని, దానికి ఇంకా టైమ్‌ పడుతుందన్నారు. అయితే ఆయనతో చేసే సినిమా ఎలా ఉంటుందనే ప్రశ్నకి గోపీచంద్‌ మలినేని చెబుతూ, పవన్ మార్క్ కామెడీ, ఫన్‌ ఉంటూనే మాస్‌ యాక్షన్‌ మూవీగా తీస్తానని తెలిపారు. అలాగని, రాయలసీమ నేపథ్యంలో ఉండదని, తన స్టయిల్‌లోనే ఉంటుందని చెప్పారు. పవన్‌ స్టయిల్‌ వేరని ఆ జోనర్‌లోనే మాస్‌, క్లాస్‌ మిక్స్ చేసి తీస్తానని తెలిపారు. 

ఇక మణిరత్నం క్లాసిక్‌ మూవీస్‌లో `దళపతి` ఒకటి. అందులో మమ్ముట్టి, రజనీకాంత్‌ కలిసి నటించారు. గ్యాంగ్‌ స్టర్‌గా మమ్ముట్టి, ఆయన అనుచరుడిగా రజనీ నటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమాని రీమేక్‌ చేస్తే మమ్ముట్టి పాత్రలో బాలయ్యని తీసుకుంటే, రజనీకాంత్‌ పాత్రలో ఎవరిని తీసుకుంటారని అడిగారు. పవన్‌, ఎన్టీఆర్‌ అనే ఆప్షన్స్ ఇవ్వగా, గోపీచంద్‌ మలినేని పవన్‌ కళ్యాణ్‌నే తీసుకుంటానని చెప్పడం విశేషం. 

అయితే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. `హరిహరవీరమల్లు` పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు హరీష్‌ శంకర్‌తో `ఉస్తాడ్‌ భగత్‌సింగ్‌` సినిమా చేయాలి. అలాగే సుజిత్‌తో ఓ గ్యాంగ్‌ స్టర్‌మూవీ చేయాల్సి ఉంది. దీంతోపాటు సముద్రఖనితో `వినోదయసీతం` రీమేక్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తి కావడానికి చాలా టైమ్‌ పడుతుంది.పైగా వచ్చే ఏపీ ఎలక్షన్లలో బిజీ అవుతారు పవన్‌. ఇవన్నీ పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లు పడుతుంది. పవన్‌తో గోపీచంద్‌ సినిమా చేయాలంటే ఇంకా రెండేళ్లు ఆగాల్సిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు