షాకింగ్.. ప్రముఖ కన్నడ నటుడి సోదరి అదృశ్యం, ఎలా జరిగింది అంటే..

Published : Jan 21, 2023, 01:40 PM IST
షాకింగ్.. ప్రముఖ కన్నడ నటుడి సోదరి  అదృశ్యం, ఎలా జరిగింది అంటే..

సారాంశం

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు అయిన నవీన్ కృష్ణ ఇంట్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 1982 నుంచే నవీన్ కృష్ణ నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా నవీన్ కృష్ణ తన సోదరి నీతా పవర్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు.

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు అయిన నవీన్ కృష్ణ ఇంట్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 1982 నుంచే నవీన్ కృష్ణ నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా నవీన్ కృష్ణ తన సోదరి నీతా పవర్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని నవీన్ కృష్ణ అభిమానులతో పంచుకుంటూ ఆచూకీ లభిస్తే తెలియజేయాలని కొన్ని నంబర్లు పోస్ట్ చేశారు. 

జనవరి 17న ఇంట్లో నుంచి బయటకి వెళ్లిన తన సోదరి నీతా కనిపించడం లేదని పేర్కొన్నారు. తన సోదరి ఫోటో వివరాలు షేర్ చేసి ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని పేర్కొన్నారు. 

తన సోదరి గురించి కుటుంబ సభ్యులంతా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే నీతా ఎందుకు ఇంటి నుంచి వెళ్లిందో ఇంకా తెలియడం లేదు. తన సోదరి గురించి సుబ్రమణ్య పుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశోద్ధారక, తిరుపతి ఎక్స్ప్రెస్, 5 ఇడియట్స్, క్రేజీ స్టార్ లాంటి చిత్రాల్లో నవీన్ కృష్ణ నటించారు. 

PREV
click me!

Recommended Stories

Peddi Movie: పెద్ది విధ్వంసం, రాంచరణ్ మూవీ ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ రివ్యూ.. తగలబెట్టేసిందిగా
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్