మిస్టర్ సి ని దున్నపోతు ఎక్కించిన ఉపాసన.. ఇంతకీ మేటరేంటి?

Published : Oct 30, 2017, 08:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మిస్టర్ సి ని దున్నపోతు ఎక్కించిన ఉపాసన.. ఇంతకీ మేటరేంటి?

సారాంశం

అన్యోన్యంగా వుండే టాలీవుడ్ జంటల్లో రామ్ చరణ్,ఉపాసన ఫస్ట్ ఇద్దరికీ తమ తమ వ్యాపారాల్లో బిజీ బిజీ షెడ్యూల్ అయినా సమయం చిక్కినప్పుడల్లా... సరదాగా గడిపేస్తారీ జంట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. తమ తమ కెరీర్లలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ యంగ్ కపుల్... విరామం దొరికితే సరదాగా తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి రిలాక్స్ అవుతుంటారు.

 

ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమా షూటింగులో ఉన్న రామ్ చరణ్ షూటింగ్ గ్యాప్ దొరకడంతో భార్యతో కలిసి లండన్ వెకేషన్ వెళ్లారు. లండన్ ట్రిప్పుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది.

 

వెకేషన్లో తన భర్త రామ్ చరణ్‌ను దున్నపోతుపై ఎక్కించి తిప్పుతున్న ఫోటోను ఉపాసన సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

రామ్ చరణ్‌ను ఉపాసన ముద్దుగా ‘మిస్టర్ సి' అని పిలుస్తూ ఉంటుంది. చిన్నతనం నుండే ఫ్రెండ్స్ అయిన చరణ్-ఉపాసన తర్వాత లైఫ్ పార్ట్‌ నర్స్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ