బాహుబలిని మించిపోయిన విజయ్ మెర్సల్

Published : Oct 30, 2017, 06:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బాహుబలిని మించిపోయిన విజయ్ మెర్సల్

సారాంశం

తమిళ తళపతి విజయ్ హీరోగా మెర్సల్ కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొడుతున్న మెర్సల్ తాజాగా బాహుబలి రికార్డును క్రాస్ చేసిన మెర్సల్ 

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్సాఫీస్ వ ద్ద కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టింది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మెర్సల్ ఈ ఘనత సాధించినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 

మెర్సల్ తమిళనాడులో ఇప్పటితతే 100కోట్ల రూపాయల మార్క్ దాటిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు తమిళంలో రజినీ కాంత్ రోబో, బాహుబలి2 మాత్రమే సాధించిన 100కోట్ల మార్కును మెర్సల్ సాధించింది. ఇది కేవలం 11 రోజుల్లోనే సాధ్యం కావటం మామూలు విషయం కాదు. తమిళనాడులో అతివేగంగా రూ.100కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా గతంలో బాహుబలి వుండేది. 17 రోజుల్లో బాహుబలి సాధించిన ఆ అరుదైన ఘనతను మెర్సల్ కేవలం 11 రోజుల్లో సాధించింది.

 

తమిళనాట ఇప్పటి వరకు ఆల్ టైమ్ హైయస్ట్ గ్రాసర్ బాహుబలి2 అయినప్పటికీ మెర్సల్ బాహుబలి రికార్డు కొల్లగొడుతుందేమో చూడాలి. మరోవైపు మెర్సల్ కలెక్షన్స్ అంతా ఫేక్ అని తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ చెప్పడం గమనార్హం. మరోవైపు తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ కానున్న మెర్సల్ విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి