రామ్‌చరణ్‌, శర్వానంద్‌ కాంబినేషన్‌లో ఉపాసన సినిమా.. అసలు విషయమేంటంటే?

Published : Jun 07, 2021, 02:30 PM IST
రామ్‌చరణ్‌, శర్వానంద్‌ కాంబినేషన్‌లో ఉపాసన సినిమా.. అసలు విషయమేంటంటే?

సారాంశం

శర్వానంద్‌, రామ్‌చరణ్‌ కలిసి సినిమా చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్‌ చెర్రీ భార్య ఉపాసన సినిమా నిర్మించబోతుందా? అంటే అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు.

శర్వానంద్‌, రామ్‌చరణ్‌ కలిసి సినిమా చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్‌ చెర్రీ భార్య ఉపాసన సినిమా నిర్మించబోతుందా? అంటే అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు. చరణ్‌, శర్వానంద్‌ కాంబినేషన్‌లో అపోలో ఫార్మసీ వైస్‌ చైర్మన్‌ అయిన ఉపాసన సినిమా ప్లాన్‌ చేస్తుందంటున్నారు. అయితే ఇది ఫీచర్‌ ఫిల్మ్ కాదని, ఓ షార్ట్ ఫిల్మ్ అని అంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలకు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ గా సేవలందిస్తున్న వారిలో వైద్యులు మొదటి వరుసలో ఉంటారు. 

డాక్టర్స్ గొప్పతనం, వారి ప్రాముఖ్యతని తెలియజేసేలా ఉపాసన ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో హీరో శర్వానంద్‌ డాక్టర్‌గా నటిస్తారని, అతిథి పాత్రలో హీరో రామ్‌చరణ్‌ కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు `ఆచార్య`లో నటిస్తున్నారు. ఇక శర్వానంద్‌ `మహాసముద్రం`లో, `ఆడవాళ్లు మీకు జోహార్లు`తోపాటు ఓ బైలింగ్వల్‌ చిత్రం చేస్తున్నాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్