సమంత ది ఫ్యామిలీ మాన్ 2: మరింత పెద్దది అవుతున్న వివాదం!

Published : Jun 07, 2021, 11:36 AM IST
సమంత ది ఫ్యామిలీ మాన్ 2: మరింత పెద్దది అవుతున్న వివాదం!

సారాంశం

ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ట్రైలర్ విడుదల నాటి నుండే తమిళులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ కారణంగా సమంత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమంతను ట్రోల్ చేయడం పరిపాటిగా మారింది. 

సమంత డెబ్యూ వెబ్ సిరీస్ జాన్ 4న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.నెగిటివ్ షేడ్స్ కలిగిన లేడీ టెర్రరిస్ట్ పాత్రలో సమంత అద్భుతం చేశారు. అయితే ఈ సిరీస్ తమిళులకు వ్యతిరేకం అని, వారి మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని  తమిళ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ట్రైలర్ విడుదల నాటి నుండే తమిళులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సిరీస్ కారణంగా సమంత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమంతను ట్రోల్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా  వెబ్‌ సిరీస్‌ను వెంటనే నిలిపివేయాలని నామ్‌ తమిళర్‌ పార్టీ అధినేత సీమాన్‌ అమెజాన్‌ సంస్థకు ఆదివారం లేఖ రాశారు. ప్రసారం నిలిపివేయకుంటే తమిళులంతా అమెజాన్‌ సంస్థ సర్వీసులన్నింటినీ బాయ్‌కాట్‌ చేస్తారని హెచ్చరించారు. సీమాన్‌తో పాటు డీఎంకే, ఎండీఎంకే అధినేత వైగో వంటి రాజకీయ నాయకులు ఈ వెబ్‌సిరీస్‌ను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా ది ప్యామిలీ మెన్‌–2 వెబ్‌సిరీస్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. చిన్నగా సమసిపోతుంది అనుకంటున్న ఈ సమస్య మరింత తీవ్ర రూపు దాల్చుతున్నట్లు కనిపిస్తుంది. ఏ విషయాన్నైనా పట్టుకుంటే సాధించే వరకు వదలని తమిళులు పోరాటం ఆపడం లేదు. ఈ వివాదంపై భారత ప్రభుత్వం, అమెజాన్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్