ఉదయ్‌ కిరణ్‌ చివరి సినిమా ,ఇన్నాళ్లూ రిలీజ్ ఎందుకు కాలేదంటే..!

By Surya Prakash  |  First Published Jun 7, 2021, 1:57 PM IST

 
వాస్తవానికి ఉదయ్ కిరణ్ సినిమాను తీసుకోవడానికి చాలా ఓటీటీలు సిద్ధంగా ఉన్నా ఇన్నాళ్ళు ముందుకు వెళ్లలేదు. కారణం నిర్మాతలతోనే అని తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మరణంతో పాటు, ఫైనాన్షియల్ సమస్యలు ఈ సినిమాను ఇబ్బందుల్లో నెట్టాయి. 


ఉదయ్‌ కిరణ్‌ మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. చివరిసారిగా ఆయన నటించిన సినిమా ‘చిత్రం చెప్పన కథ’. ఉదయ్‌ కిరణ్‌ చనిపోయిన రెండు నెలలకు ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. అయితే రకరకాలతో కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు తన సన్నిహితులతో ఉదయ్ కిరణ్.. ఈ సినిమా తన సినీ కేరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పేవారట. అయితే, ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలతో ఉదయ్ కిరణ‌్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అలా మూలన పడ్డ ఈ సినిమా మళ్లీ  ఇన్నేళ్లకు వార్తల్లోకి ఎక్కింది. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

ఆ మధ్యన సంవత్సరం క్రితం లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని టాక్ నడిచింది. కానీ, రేటు విషయంలో మేకర్స్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రస్తుతం వరసపెట్టి అనేక సినిమాలు ఓటీటీలోనే విడుదలవున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని తెలుస్తోంది.

Latest Videos

వాస్తవానికి ఉదయ్ కిరణ్ సినిమాను తీసుకోవడానికి చాలా ఓటీటీలు సిద్ధంగా ఉన్నా ఇన్నాళ్ళు ముందుకు వెళ్లలేదు. కారణం నిర్మాతలతోనే అని తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మరణంతో పాటు, ఫైనాన్షియల్ సమస్యలు ఈ సినిమాను ఇబ్బందుల్లో నెట్టాయి. ఇప్పటికిప్పుడు ఈ సినిమాను ఓటీటీకి అమ్మినా ఆర్థిక కష్టాలు తీరేలా లేవట. అందుకే ఈ సినిమా ఇన్నాళ్లూ రిలీజ్ చేయలేకపోయారు. ఈ లాక్ డౌన్ టైమ్ లోనైనా ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమాకు మోక్షం లభిస్తుందేమో చూడాలి అంటున్నారు. 

 ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన 'చిత్రం చెప్పిన కథ' ఏడేళ్ల తర్వాత విడుదల కానుంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మదల్సా శర్మ తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీలలో కలిపి దాదాపు 15 సినిమాల్లో నటించింది. 

click me!