ఉపాసన రామ్ చరణ్.. మోస్ట్ పవర్ఫుల్!

By Prashanth MFirst Published 25, Sep 2018, 9:02 PM IST
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ఓ వైపు అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ బాధ్యతలను మోస్తూనే మెగా కోడలిగా మంచి నడవడికతో అందరిని ఆకర్షిస్తోంది. ఇక భార్యగా రామ్ చరణ్ కు ఎప్పటికప్పుడు తోడుగా ఉంటూ వస్తోంది. సినిమా షూటింగ్స్ లో చరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉపాసన అతని వెంటే కనిపిస్తుంటారు. 

రీసెంట్ గా బోయపాటి ప్రాజెక్టు లో భాగంగా అబైర్జాన్ అనే దేశనికి చెర్రీ వెళ్లగా ఉపాసన వారం గ్యాప్ రాగానే భర్తకు తోడుగా ఉండటానికి వెళ్ళింది. అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అపోలోను కూడా ఆమె చాలా బాధ్యతగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉపాసనకు అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా ఇటీవల ప్రకటించిన  మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ జాబితాలో ఉపాసన పేరు ఉండడం ప్రశసించాల్సిన విషయం. 

వివిధ రంగాలకు చెందిన అత్యంత శక్తివంతమైన మహిళకు టైకూన్స్ అఫ్ టుమారో పేరుతో  పురస్కారం అందజేస్తారు. అయితే ఈ భవిష్యత్తు శక్తి కిరణాల జాబితాలో ఉపాసనతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు కూడా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం అభిమానుల నుంచి వీరికి ప్రశంసలు అందుతున్నాయి.  

Last Updated 25, Sep 2018, 9:02 PM IST