డ్యాన్స్ నేర్పిస్తానని అసభ్యంగా ప్రవర్తించాడు: తనుశ్రీ

By Prashanth MFirst Published 25, Sep 2018, 8:09 PM IST
Highlights

బాలీవుడ్ లో మంచి సినిమాలు చేసి కొన్నేళ్ల క్రితం తను శ్రీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో 2005లో బాలకృష్ణ చేసిన వీరభద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తను శ్రీ తనకు ఎదురైనా వేధింపుల గురించి వివరణ ఇచ్చింది. 

గత కొంత కాలంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి ఇండస్ట్రీలో నటీమణులు వారికి ఎదురైనా చేదు అనుభవాలను గురించి ధైర్యంగా చెప్పేస్తున్నారు. రీసెంట్ గా మరో నటి కూడా తనకు ఎదురైనా వేధింపుల గురించి వివరణ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు 2004లో పేమినా మిస్ ఇండియా యూనివర్స్ గా నిలిచిన తను శ్రీ దత్తా. 

అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఎనిమిదేళ్లవుతోంది. బాలీవుడ్ లో మంచి సినిమాలు చేసి కొన్నేళ్ల క్రితం తను శ్రీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో 2005లో బాలకృష్ణ చేసిన వీరభద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తను శ్రీ తనకు ఎదురైనా వేధింపుల గురించి వివరణ ఇచ్చింది. 

ఆమె మాట్లాడుతూ.. ఇందులో దాచిపెట్టడానికి ఏమి లేదు. సినిమా ఇండస్ట్రీలో వేధింపులు చాలా కామన్. నాకు ఒకసారి చేదు అనుభవం ఎదురైంది. 2008లో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సహనటుడు ఒకతను డ్యాన్స్ స్టెప్స్ నేర్పిస్తాను అని అసభ్యంగా ప్రవర్తించాడు. చాలా మంది హీరోయిన్స్ పరిస్థితి ఇలానే ఉంది. వేధింపులను ఎదుర్కొంటే బయటకు చెప్పాలేని పరిస్థితి. అందుకే ఆ ఘటనలు బయటకు రావని తను శ్రీ తెలిపింది. అయితే ఆమెను వేధించిన నటుడు ఎవరనే విషయాన్నీ బయటపెట్టలేదు. 

Last Updated 25, Sep 2018, 8:09 PM IST