Unstoppable: బాలయ్య నెక్స్ట్ గెస్ట్ గా నాచురల్ స్టార్... ఆయన ఫైర్ తట్టుకోగలడా!

Published : Nov 08, 2021, 12:13 PM IST
Unstoppable: బాలయ్య నెక్స్ట్ గెస్ట్ గా నాచురల్ స్టార్... ఆయన ఫైర్ తట్టుకోగలడా!

సారాంశం

అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ సక్సెస్ అన్న మాట సర్వత్రా వినిపిస్తుంది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫైర్ బ్రాండ్ గా పేరున్న మోహన్ బాబు (Mohan babu)ను మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా పిలిచి, ఆసక్తికర ప్రశ్నలతో ఆద్యంతం అలరించేలా నడిపారు బాలయ్య. 

బాలయ్య హోస్ట్ గా టాక్ షోనా...!, అంటూ చాలా మంది షాక్ అయ్యారు. కొందరైతే ఈ షో అట్టర్ ప్లాప్ కావడం ఖాయమని, పెదవి విరిచారు.వాళ్ళ అంచనాలు తలక్రిందులు చేస్తూ... ఫీల్డ్ ఏదైనా తాను అడుగుపెడితే దద్దరిల్లాల్సిందే అని, బాలయ్య(Balakrishna) నిరూపించాడు. మొదటి ఎపిసోడ్ ఊహకు మించిన సక్సెస్ చేసి, విమర్శించిన వాళ్ళ నోటికి తాళం వేశాడు. 


అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ సక్సెస్ అన్న మాట సర్వత్రా వినిపిస్తుంది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫైర్ బ్రాండ్ గా పేరున్న మోహన్ బాబు (Mohan babu)ను మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా పిలిచి, ఆసక్తికర ప్రశ్నలతో ఆద్యంతం అలరించేలా నడిపారు బాలయ్య. టాక్ షో అంటే ఏదో సదా సీదా ప్రశ్నలతో లాగించేస్తారు అనుకుంటే... కాంట్రవర్సీ ప్రశ్నలతో ప్రేక్షకులలో ఉత్కంఠ రాజేశారు. అలాగే హోస్ట్ మాత్రమే అడగాలి, గెస్ట్ మాత్రమే చెప్పాలి అనే సాంప్రదాయం వదిలేసి, పరస్పరం ప్రశ్నించుకోవడం బాగుంది. 


మొత్తంగా అన్ స్టాపబుల్ (Unstoppable) ఫస్ట్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ హిట్ అని అందరూ అంటున్నారు. ఇదే ఊపులో నెక్స్ట్ ఎపిసోడ్ కి బాలయ్య సిద్ధం అయ్యారు. ఈసారి నాచురల్ స్టార్ నాని ని ఆయన ఇంటర్వ్యూ చేయనున్నారు. నాని గెస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో ప్రోమో నేడు సాయంత్రం విడుదల కానుంది. అయితే ఫోటోలను మాత్రం ఆహా యూనిట్ విడుదల చేయడంతో పాటు, తమ నెక్స్ట్ గెస్ట్ నాని అంటూ, అధికారికంగా ప్రకటించారు. మోహన్ బాబు లాంటి మొండి మనిషినే ఓ ఆట ఆడుకున్న బాలయ్య.. నాని ని ఎటువంటి ప్రశ్నలతో తికమక పెట్టనున్నాడో చూడాలి. 

దర్శకుడు అవ్వాలని పరిశ్రమకు వచ్చిన నాని (Nani), హీరోగా మారిన విషయం తెలిసిందే. స్వయం కృషితో హీరోగా ఎదిగిన నాని.. రేడియో జాకీగా కూడా పని చేశారు. మరి ఎంత టాలెంట్ ఉన్నా.. అక్కడ ఉంది బాలయ్య కాబట్టి, ఎదుర్కోవడం కష్టమే. 

Also read బాలయ్యతో చిరు, రాంచరణ్, ఎన్టీఆర్.. 'ఆహా'కు కాసుల పంట, ఆ లీకులు నిజమైతే..
కాగా నాని తన నెక్స్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ విడుదల కానుంది. అలాగే బాలయ్య అఖండ విధులకు సిద్ధం అవుతుండగా, ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. 

Also read Degala Babji Trailer: బండ్ల గణేష్ వన్ మ్యాన్ షో.. డేగల బాబ్జి ట్రైలర్ వచ్చేసింది, పూరి రెస్పాన్స్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది