Degala Babji Trailer: బండ్ల గణేష్ వన్ మ్యాన్ షో.. డేగల బాబ్జి ట్రైలర్ వచ్చేసింది, పూరి రెస్పాన్స్

pratap reddy   | Asianet News
Published : Nov 08, 2021, 10:53 AM IST
Degala Babji Trailer: బండ్ల గణేష్ వన్ మ్యాన్ షో.. డేగల బాబ్జి ట్రైలర్ వచ్చేసింది, పూరి రెస్పాన్స్

సారాంశం

నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'డేగల బాబ్జి'. బండ్ల గణేష్ హీరోగా, ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. గణేష్ నిర్మాతగానే కాదు కమెడియన్ గా కూడా పాపులర్. 

నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'డేగల బాబ్జి'. బండ్ల గణేష్ హీరోగా, ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. గణేష్ నిర్మాతగానే కాదు కమెడియన్ గా కూడా పాపులర్. నిర్మాత అయ్యాక నటన తగ్గించాడు. కానీ మైక్ అందుకున్నాడంటే గణేష్ పూనకంతో ఊగిపోతాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు గణేష్ ని ఎవ్వరూ ఆపలేరు. 

రాజకీయంగా కూడా Bandla Ganesh హాట్ టాపిక్ అయ్యాడు. దీనితో ప్రేక్షకుల్లో గణేష్ క్రేజ్ బాగా పెరిగింది. తమిళంలో పార్తిబన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఒత్తా సెరప్పు సైజ్ 7' చిత్రానికి Degala Babji అధికారిక రీమేక్. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ డాషింగ్ డైరెక్టర్ Puri Jagannadh చేతుల మీదుగా విడుదలైంది. 

Also Read: కత్రినా, విక్కీ 'రోకా' వేడుక.. ఆ డైరెక్టర్ ఇంట్లో సీక్రెట్ గా ఫినిష్

తెలుగులో సింగిల్ ఆర్టిస్ట్ తో సింగిల్ లొకేషన్ లో తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే అని మేకర్స్ ట్రైలర్ లో తెలిపారు. ఓ మర్డర్ కేసులో బండ్ల గణేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. దీనితో గణేష్ తన కథని పోలీసులకు వివరిస్తుంటాడు. ట్రైలర్ లో ఎక్కడా మరో ఆర్టిస్ట్ కనిపించరు. మొత్తం బండ్ల గణేషే ఉంటాడు. బండ్ల గణేష్ ఇస్తున్న హావభావాలు బావున్నాయి. ఈ చిత్రంలో కొంచెం హర్రర్ టచ్ కూడా ఉన్నట్లుంది. కథ ఏంటనే విషయం బయటపడకుండా ఆసక్తి పెంచారు. 

దేన్నో చూస్తూ భయపడుతున్న బండ్ల గణేష్ నటన అద్భుతంగా ఉంది. కథ మొత్తం పోలీస్ స్టేషన్ లోనే జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. బ్యాగ్రౌండ్ లో బావ బావ అంటూ లేడి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. బ్యాగ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంటోంది. 

 

ట్రైలర్ లాంచ్ చేస్తూ పూరి జగన్నాధ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు బండ్ల గణేష్ తో పాతికేళ్ల అనుబంధం నాది. ఇద్దరం ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. చాలా ఆనందంగా ఉంది. ఇప్పడే డేగల బాబ్జి ట్రైలర్ చూశా. అదిరిపోయింది. బండ్ల గణేష్ పిచ్చోడిలా కనిపిస్తున్నాడు, ఎమోషన్ కూడా ఉంది..  కానీ కథని గెస్ చేయలేకున్నా బండ్ల గణేష్ కి, దర్శకుడికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అంటూ పూరి జగన్నాధ్ తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే