Unstoppable బాలయ్య... టాక్ షోపై అధికారిక ప్రకటన

Published : Oct 13, 2021, 02:08 PM IST
Unstoppable బాలయ్య... టాక్ షోపై అధికారిక ప్రకటన

సారాంశం

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ టైటిల్ తో ఓ టాక్ షో ప్రసారం కానుంది. దీనిపై కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. నేడు అధికారిక ప్రకటన చేయనున్నారు.

నట సింహం బాలయ్య విశ్వరూపాన్ని వెండితెరపై చూసి తరించిన అభిమానులు, ఇక బుల్లితెరపై కూడా ఆ అనుభూతిని పొందనున్నారు. బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ టైటిల్ తో ఓ టాక్ షో ప్రసారం కానుంది. దీనిపై కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. నేడు అధికారిక ప్రకటన చేయనున్నారు. నేడు సాయంత్రం 3 గంటలకు నోవొటెల్ హోటల్ హైదరాబాద్ వేదికగా ఈ లాంచింగ్ ఈవెంట్ జరగనుంది. 


బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అంటూ భారీ ఎత్తున ఈ టాక్ షోకి ప్రచారం కల్పిస్తున్నారు. అల్లు అరవింద్ కి చెందిన తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఈ Unstoppable talk show ప్రసారం కావడం మరో విశేషం. దీనితో మెగా హీరోలు బాలయ్య టాక్ షోలో పాల్గొనే అవకాశం కలదు. ఇక మొదటి ఎపిసోడ్ లో Balakrishna చిరంజీవిని ఇంటర్వ్యూ చేయనున్నారంటూ ఇప్పటికే కథనాలు వెలువడుతున్నాయి. బాలయ్య లాంటి ఫైర్ బ్రాండ్ ఓ టాక్ షోకి హోస్టింగ్ చేయడం, ఆసక్తికరంగా మారింది. 


కాగా టాలీవుడ్ కి చెందిన నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా, నాని రియాలిటీ, టాక్ షోలలో కనిపించి సందడి చేశారు. Nagarjuna మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే గత మూడు సీజన్స్ నుండి బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ Chiranjeevi సైతం మీలో ఎవరు కోటీస్వరుడు షోకి హోస్ట్ గా చేశారు. 

Also read ఆ మూవీ కోసం అఖిల్ పిచ్చ వెయిటింగ్.. విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఆసక్తి


నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ బాధ్యతలు సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించారు. లేటెస్ట్ గా జెమినీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోకి ntr హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా బాలయ్య ఓ టాక్ షోకి హోస్ట్ గా మారి అందరినీ షాక్ కి గురిచేశారు. 

Also read బాలయ్య నెక్స్ట్ కి ఆ టైటిల్? నిజమే అయితే మామూలుగా ఉండదు
మరోవైపు బాలయ్య నటించిన అఖండ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవలే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం Akhanda. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ భారీ విజయాలు నమోదు చేశాయి. దీనితో అఖండ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బాలయ్యకు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీంద్రారెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..