నాటు నాటు సాంగ్ తో ఉక్రెయిన్ ఆర్మీ సంచలనం, రష్యా పరువు తీసేలా.. ఎనర్జిటిక్ వీడియో వైరల్

By Asianet NewsFirst Published May 30, 2023, 2:51 PM IST
Highlights

ఏడాది కాలంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ రష్యా తగ్గడం లేదు. 

ఏడాది కాలంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ రష్యా తగ్గడం లేదు. రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఉక్రెయిన్ లో నాటు నాటు సాంగ్ ని షూట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ షూట్ చేసిన ఆ పాట ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. ఏకంగా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులని కూడానా గెలుచుకుంది. 

నాటు నాటు సాంగ్ పై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఇప్పటికే ఎన్నో లక్షల రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేశారు. సెలెబ్రిటీలు సైతం నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేశారు. కానీ ఈ సారి ఏకంగా ఉక్రెయిన్ ఆర్మీ సంచలనం సృష్టించింది. తమపై రష్యా చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఆర్మీ నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రీ ట్వీట్ చేసింది. 

🙏🏻🙏🏻🙏🏻 https://t.co/QTOqdWIgcq

— RRR Movie (@RRRMovie)

నాటు నాటు సాంగ్ ని ఉక్రెయిన్ ఆర్మీ వారి భాషలోకి అనువదించుకుని పెర్ఫామ్ చేశారు. ఇక్కడ రష్యా ఆర్మీని విలన్ గా చూపిస్తూ ఎనర్జిటిక్ గా, ఫన్నీగా చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

రాజమౌళి ఈ సాంగ్ ని చిత్రీకరించాలనుకున్నపుడు ఇండియాలో వర్షాలు పడుతున్నాయి. దీనితో నాటు నాటు సాంగ్ కి సరైన వేదిక కోసం అన్వేషిస్తుండగా ఎవరో ఉక్రెయిన్ లో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ గురించి చెప్పారు. ఆ ప్యాలెస్ బయట ఆవరణం నాటు నాటు సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అక్కడకి వెళ్లారు. ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసిన కో డ్యాన్సర్లు అంతా ఉక్రెయిన్ వాళ్లే కావడం విశేషం. 

click me!