ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న Nani 30 యూనిట్.. ఆ విషయంలో మృణాల్ ఫుల్ ఖుషీ

By Asianet News  |  First Published May 30, 2023, 2:24 PM IST

నేచురల్ స్టార్ నాని - మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం Nani30. శౌర్యన్ దరక్శత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పై అప్డేట్ అందింది.
 


నేచురల్ స్టార్ నాని (Nani) రీసెంట్ గా ‘దసరా’ చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ ను అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో మార్చి30న విడుదలైన ఈ చిత్రం  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. నాని కేరీర్ లోనే రూ.100 కోట్లు వసూల్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ జంటగా నటించింది.

ఈ చిత్రం తర్వాత నాని తన నెక్ట్స్ ప్రాజెక్ట్ Nani30పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలై చకాచకా కొనసాగుతోంది. తాజాగా మూవీ ఓ కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది యూనిట్ అప్డేట్ అందించింది. మొదటి షెడ్యూల్ ను గోవాలో పూర్తి చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ ను ముంబైలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Latest Videos

షూటింగ్ పై అప్డేట్ ఇస్తూ షేర్ చేసిన ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ గా మారింది. నాని క్లాస్ లుక్ లో అట్రాక్టివ్ ఉన్నారు. ఇక మృణాల్ తన బ్యూటీతో ఎప్పటిలాగే ఆకట్టుకుంది. అయితే ‘సీతారామం’ తర్వాత మృణాల్ ‘నాని30’లో నటిస్తోంది. తను సౌత్ లో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, తన సౌత్ ఫిల్మ్ మొదటిసారిగా ముంబైలో షూట్ చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. 

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాని ఈ చిత్రంతోనూ కొత్తదనాన్ని చూపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సెప్టెంబర్ నాటికల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేసేలా యూనిట్ కృషి చేస్తోంది. ఇదే ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుగా థియేటర్లలోకి రానుంది. చిత్రంలో కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. హీషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

 

. wraps up filming for 🔥 on a delicious note!

A feast for the senses awaits! ✨ pic.twitter.com/0jF0ktkeoy

— SIIMA (@siima)
click me!