భోళా శంకర్ నుండి అదిరిపోయే అప్డేట్...  పోస్టర్ కేక!

By Sambi ReddyFirst Published May 30, 2023, 2:30 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ప్రొమోషన్స్ షురూ చేశారు. 
 

వాల్తేరు వీరయ్య మూవీ విజయంతో చిరంజీవి జోరు మీదున్నారు. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య విడుదలైన మరో ఎనిమిది నెలలకు భోళా శంకర్ అంటూ వచ్చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. 

భోళా శంకర్ నుండి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు. ఇది భోళా శంకర్ టైటిల్ సాంగ్ అని సమాచారం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ అప్డేట్ కోసం భోళా శంకర్ టీమ్ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. 

The wait is over🌟 for the
MEGA MUSIC MANIA of 🔱 Starts Soon 📣 🎶💥Stay Tuned❤️‍🔥 thumping musical 🥁

Mega🌟 … pic.twitter.com/jZgxAPlRGv

— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh)

ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంది. వీరి కాంబోలో ఇది రెండో చిత్రం. స్టార్ లేడీ కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్. చాలా గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ మెగా ఫోన్ పట్టాడు. ఆయనకు ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 
 

click me!