రీరిలీజ్ కాబోతున్న ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీ

Published : Mar 06, 2024, 07:11 AM IST
రీరిలీజ్ కాబోతున్న  ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీ

సారాంశం

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి మంచి సినిమాలుఅందించిన ఆయన పదేళ్ల క్రిందట తిరిగిరాని లోకాలకువెళ్లిపోయాడు. ఇక ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారుమేకర్.. ఆయన సూపర్ హిట్ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. 


టాలీవుడ్ లో ఎందరో హీరోలు తమ ప్రభావాన్ని చాటుకున్నారు. స్టార్ హీరోలుగా ఎదిగే క్రమంలోనే కొంతమంది పాతాళానికి పడిపోయారు. మంచి ఇమేజ్ వస్తున్న టైమ్ లో మరణించిన హరోలు కూడా లేకపోలేదు. అటువంటివారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.  తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు  ఉదయ్ కిరణ్. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా లవర్ బాయ్ గా ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు ఇప్పటికీ అభిమానులనుఅలరిస్తున్నాయి. 

ఇక ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నువ్వు నేను కూడా ఒకటి.  అనిత హీరోయిన్ గా నటించిన ఈసినిమాను .. టాలీవుడ్ క్రేజీ దర్శకుడు.. తేజ ఈసినిమాను డైరెక్ట్ చేశారు. మూవీకి ఉదయ్ కిరణ్ నటనతో పాటు.. సునిల్ కామెడీ.. ఆర్ పి పట్నాయక్ మ్యూజిక్ ప్రాణం పోశాయని చెప్పవచ్చు. దాంతో సినిమాబ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా కావడంతో.. ఇట తేజా కు.. అటు ఉదయ్ కిరణ్ కు ఈసినిమాతో మంచి క్రేజ్  కూడా వచ్చింది. 

 

అసలే ఏమాతరం అంచనాలు లేకుండా  2001 లో రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ డే నుంచే ఫస్ట్  షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం