రొమాన్స్ ఇప్పుడు కామనే అంటోన్న `రానా` టీమ్‌.. స్టార్లతో సినిమా చేయనంటోన్న సీనియర్‌ డైరెక్టర్‌

Published : Mar 05, 2024, 11:44 PM IST
రొమాన్స్ ఇప్పుడు కామనే అంటోన్న `రానా` టీమ్‌.. స్టార్లతో సినిమా చేయనంటోన్న సీనియర్‌ డైరెక్టర్‌

సారాంశం

ఇప్పుడు సినిమాల్లో రొమాన్స్ కామనే అని అంటున్నారు `రానా` దర్శక, హీరో, అలాగే తాను దర్శకుడిగా పెద్ద హీరోలతో సినిమాలు చేయనని తెగేసి చెబుతున్నారు చదలవాడ శ్రీనివాసరావు.   

రాజుగారి కూతురిని నాయుడుగారి కొడుకు ప్రేమించాడు. ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. సడెన్‌గా రాజుగారి కూతురుని నాయుడిగారి కొడుకు చంపేశాడు. మరి ఎందుకు చంపాడు? వెనకాలు కథేంటి? దీంతో రాజుగారి రియాక్షన్‌ ఏంటి? నాయుడుగారు ఏం చేశారనేది `రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి` చిత్రం కథ. విలేజ్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. సత్యరాజ్‌ దర్శకత్వం వహించారు. రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్‌ హీరోయిన్‌గా నటించింది. ముత్యాల రామదాసు, నున్నా కుమారి  సంయుక్తంగా నిర్మించారు. మార్చి 9న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో రవితేజ నున్నా, దర్శకుడు సత్యరాజ్‌. 

విలేజ్‌ బ్యాక్‌ గ్రాప్‌లో కూల్‌ ఎంటర్‌టైనర్స్, లవ్‌ స్టోరీస్ వచ్చాయి. యాక్షన్‌ మూవీస్‌ వచ్చాయి. కానీ రొమాన్స్, క్రైమ్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో మూవీ రాలేదు. తాము ఈ మూవీతో ఆ కొత్తదనం చూపించబోతున్నామని తెలిపారు. సినిమాలో రొమాన్స్ కథలో భాగంగానే ఉంటుందని, అతిగా ఉండదని తెలిపారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రొమాన్స్ ని లైట్‌గానే చూస్తున్నారు. ఇందులోనూ సాంగ్‌లో కాస్త బోల్డ్ గా రొమాన్స్ ఉంటుంది. న్యూడిటీ కూడా ఉంటుంది. లిప్‌ లాక్‌లుంటాయి. అవి కథకి తగ్గట్టుగానే ఉంటాయని, కావాలని ఆడియెన్స్ ని సినిమాకి రప్పించాలని పెట్టలేదన్నారు దర్శక, హీరో. సినిమా.. రొమాన్స్ నుంచి కథ క్రైమ్‌ వైపు టర్న్ తీసుకుంటుందని, ఆ తర్వాత ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. 

సంగీత దర్శకుడు రోషన్‌ సాలూరు సంగీతం తమకు పెద్ద అసెట్‌ అవుతుందని, మణిశర్మ మ్యూజిక్‌ ఇచ్చినట్టుగానే ఉందని, అంత బాగా ఆకట్టుకుంటుందని, బీజీఎం మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, చిన్న సినిమాగా ఎవరూ ఫీల్‌ అవ్వరని తెలిపారు. ఇక టైటిల్‌ గురించి చెబుతూ, కులాన్ని హైలైట్‌ చేయడం మా ఉద్దేశ్యం కాదని, హుందాగా పెట్టినవే అని, అమలాపురం వైపు ఇలాంటి పేర్లు ఎక్కువగా ఉంటాయని, అలా ఆడియెన్స్ కి రీచ్‌ ఈజీ అవుతుందని ఆ టైటిల్‌ పెట్టినట్టు చెప్పారు.  రెండు కుటుంబాల మధ్య జరిగే ఇంటెన్స్ స్టోరీ ఇది. ఎక్కడా కులాల ప్రస్తావన ఉండదన్నారు. సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు.  

వార్నర్‌ బ్రదర్స్ లాంటి సినిమాలు చేసి చూపిస్తా.. చదలవాడ శ్రీనివాసరావు..


`వార్నర్‌ బ్రదర్స్` తీసే సినిమాల కంటే తాను గొప్ప సినిమాలు, హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌ ఉన్న సినిమాలు తీసి చూపిస్తానని అంటున్నారు దర్శక, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వం వహించిన మూవీ `రికార్డ్ బ్రేక్‌`.  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. నిహార్‌ కపూర్‌, నాగార్జున, రగ్దా ఇష్తాకర్‌, సత్యకృష్ణ, సంజన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

``బిచ్చగాడు` సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ `రికార్డ్ బ్రేక్‌` సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో రూపొందించాం. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం.  వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్, మీడియా షో లో వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడంతో మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది.  

కంటెంట్‌ ఉన్న చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. `బిచ్చగాడు` అదే నిరూపించింది. అందుకే ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించాం. క్లైమాక్స్ లో వీఎఫ్‌ఎక్స్ కి చాలా ఖర్చు చేశాం. అప్పట్లో నేను డైరెక్ట్ చేసిన `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`  సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ `రికార్డు బ్రేక్` ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది. ఆర్‌ నారాయణ మూర్తి చూసి అభినందించారు. ఇక సినిమాని తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. టాక్‌ని బట్టి పెంచుతాం. `బిచ్చగాడు` అలానే చేశాం పెద్ద హిట్‌ అయ్యింది. 

పెద్ద హీరోలతో సినిమాలు చేయను. ఇలాంటి చిన్న చిత్రాలే చేస్తాను. ఒకప్పుడు దర్శక, నిర్మాత భార్యాభర్తల అనుబంధంలా ఉండేది, ఇప్పుడు దర్శకుడు, హీరో కలిసిపోయి నిర్మాతని లెక్కచేయడం లేదు. అందుకే పెద్ద హీరోలతో సినిమాలు చేయను. దర్శకుడిగా కొనసాగతాను. వార్నర్‌ బ్రదర్స్ లాంటి టెక్నికల్‌ మూవీ చేసి తానేంటో నిరూపిస్తాను అని తెలిపారు చదవలవాడ శ్రీనివాసరావు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే