ఘాజీ దెబ్బకు చాలా దూరం వెళ్లిపోయిన హీరోలు

Published : Feb 11, 2017, 04:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఘాజీ దెబ్బకు చాలా దూరం వెళ్లిపోయిన హీరోలు

సారాంశం

ఘాజీ మూవీపై భారీ అంచనాలు నెలకొల్పిన ట్రైలర్ పాకిస్తాన్ పై యుద్ధం చేసిన ఘటన ఆధారంగా మూవీ అంచనాలు పీక్స్ కు వెళ్లడంతో సైడైపోయిన ఇద్దరు హీరోలు తప్పుకున్న మనోజ్ గుంటూరోడు, రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త

రానా హీరోగా నటించిన ఘాజీ సినిమా ఒకే ఒక్క నెలలో మొత్తం అంచనాలు పెంచేసింది. మమూలు సినిమా అనుకున్నది ఒక్కసారి భారీ సినిమాగా మారిపోయింది. ఈనెల 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ లో సైతం ఫుల్ క్రేజ్ సంపాదించేసుకుంది. ఘాజీ మూవీకి అటు బాలీవుడ్ లోనే కాక తెలుగులో మంచి హైప్ క్రియేట్ కావటంతో.. దీనికి పోటీగా వెళ్తే దెబ్బయిపోతామని తెలుసుకుని ముందుగానే మేల్కొని రెండు సినిమాల్ని వాయిదా వేసేశారు.

"యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, శత్రువు ప్రాణాలు తీసేయడమంటూ అదరిపోయే డైలాగ్‌తో ప్రారంభమైన ఘాజీ టీజర్‌  పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసేందుకు రానా టీమ్ చేసిన సాహసాన్ని చూపించారు. ఇక ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు. అంతేకాదు.. ఈ చిత్రం ఆరు నెలల ముందే విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

 

అయితే గత నెలలో ఉన్నట్లుండి రాజ్ తరుణ్ సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త'ను కూడా ఇదే తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మంచు మనోజ్ సినిమా ‘గుంటూరోడు' కూడా ఫిబ్రవరి 17కే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఘాజీ దెబ్బకు రెండు సినిమాలు పక్కకు తప్పుకున్నాయి.

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్