శ్రీదేవి కుమార్తె జాహ్నవికి స్రిక్ట్ రూల్స్.. ఇక కనిపించదా

Published : Feb 11, 2017, 10:10 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
శ్రీదేవి కుమార్తె జాహ్నవికి స్రిక్ట్ రూల్స్.. ఇక కనిపించదా

సారాంశం

జాహ్నవికి నిబంధనలు విధించిన తల్లి శ్రీదేవి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ బాలీవుడ్ లో కూతురు  గ్రాండ్ ఎంట్రీ కోసం తెగ ట్రై చేస్తున్న శ్రీదేవి

అందాల తార శ్రీదేవిని కోరుకునే వాళ్లందరి కోసం ఇప్పుడు అందరి దృష్టి.. మరికొన్నాళ్లలో సినీ అరంగేట్రం చేయనున్న శ్రీదేవి కూతుర జాన్వి కపూర్ పైనే ఉంది.

తన పెద్ద కూతురుని హీరోయిన్ చేయడం విషయంలో శ్రీదేవి చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. స్టైలింగ్ నుంచి ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ  భామకు.. ఇప్పుడీ అందాల మమ్మీ కొత్త రూల్ పెట్టిందట. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఫోటోలను సోషల్ మీడియాలో రివీల్ చేయద్దని చెప్పిందట. ఎప్పటికప్పుడు ఆమె లుక్స్ బైటకు వచ్చేస్తుండడంతో.. కూతురు సినీ ఎంట్రీపై హైప్ క్రియేట్ అవదని.. శ్రీదేవి ఉద్దేశ్యం కావచ్చని అంటున్నారు బాలీవుడ్ జనాలు.గతంలో కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదంటూ ఇలాగే ఓ రూల్ పెట్టింది జాన్వీ కపూర్ మమ్మీ.

అయితే.. జాన్వీ కపూర్ అరంగేట్రం కోసం శ్రీదేవి తెరవెనుక ప్రయత్నాలు చాలానే చేస్తోంది. మరోవైపు.. ఇన్నాళ్లు జాన్వీ సెల్ఫీలతో అందాల విందు చేసుకున్న అభిమానులు.. ఇకపై ఈ అమ్మడు కనిపించదేమో అని ఇప్పటినుంచే బెంగ పెట్టేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్