ఇంకా బతికే ఉంటే రా.. నిన్ను నేను చంపేస్తా.. భర్తపై హీరోయిన్ ఆగ్రహం!

Published : Mar 06, 2019, 01:46 PM IST
ఇంకా బతికే ఉంటే రా.. నిన్ను నేను చంపేస్తా.. భర్తపై హీరోయిన్  ఆగ్రహం!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ భయంకరమైన స్టంట్ పట్ల ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఫైర్ అయ్యారు. నిన్ను చంపేస్తా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. 

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ భయంకరమైన స్టంట్ పట్ల ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఫైర్ అయ్యారు. నిన్ను చంపేస్తా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అక్షయ్ 'ది ఎండ్' అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు.

అక్షయ్ నటించబోయే తొలి వెబ్ సిరీస్ కావడంతో దీన్ని గ్రాండ్ గా ప్రకటించాలని అనుకున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఒంటికి నిప్పంటించుకొని స్టేజ్ పై నడిచారు. ఏ హీరో చేయని స్టంట్ అక్షయ్ కుమార్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కానీ ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అక్షయ్ కుమార్ భార్య ఏకంగా అతడికి వార్నింగ్ ఇచ్చింది. 'నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకున్నావ్. దీని తరువాత కూడా నువ్ బతికే ఉంటే ఇంటికి రా.. నిన్ను నేను చంపేస్తాను' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి అక్షయ్ బదులిస్తూ.. ''ఇప్పుడు నాకు ఈ విషయంలో భయంగా ఉంది'' అంటూ ట్వీట్ పెడుతూ.. 'దేవుడానన్ను కాపాడు' అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. తన కొడుకు ఆరవ్ సూచన మేరకు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు అక్షయ్ వెల్లడించారు. దీంతో పాటు 'కేసరి', 'సూర్యవంశి' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు అక్షయ్.   

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా