బిగ్ బాస్ 3లో ఆ ముగ్గురు.. నటి జ్యోతి కామెంట్స్!

Published : Mar 06, 2019, 12:54 PM ISTUpdated : Mar 06, 2019, 12:57 PM IST
బిగ్ బాస్ 3లో ఆ ముగ్గురు.. నటి జ్యోతి కామెంట్స్!

సారాంశం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన నటి జ్యోతి బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టంట్ గా పాల్గొంది. అయితే కొద్దిరోజులకే ఆమె షో నుండి బయటకి వచ్చేసింది. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన నటి జ్యోతి బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టంట్ గా పాల్గొంది. అయితే కొద్దిరోజులకే ఆమె షో నుండి బయటకి వచ్చేసింది. త్వరలోనే బిగ్ బాస్ 3 షో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్ సీజన్ 2ని బిగ్ బాస్ 1తో పోలుస్తూ సీజన్ 2లో కంటెస్టంట్స్ అందరూ ఇష్టానుసారంగా ఉండేవాళ్లని, వాళ్లకు చాలా ఫ్రీడం ఉండేదని చెప్పింది. ఆ అవకాశం తనకు వచ్చి ఉంటే బాగుండేదని తెలిపింది.

బిగ్ బాస్ 2లో ఏ కంటెస్టంట్ కి భయం లేదని సీజన్ 1 అలా కాదని.. హోస్ట్ ఎన్టీఆర్ అంటే ప్రతీ ఒక్కరిలో భయం ఉండేదని చెప్పింది. సీజన్ 2 హైదరాబాద్ లో నిర్వహించడం కూడా మైనస్ అని, ఆ కారణంగా కూడా కంటెస్టంట్స్ లో భయం లేదని చెప్పింది.

సీజన్ 1 లో పాల్గొన్న సమయంలో కంటెస్టంట్స్ లో చాలా ఒత్తిడి ఉండేదని తెలిపింది. ఇక బిగ్ బాస్ 3 గురించి తనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయని, కంటెస్టంట్స్ గా వరుణ్ సందేశ్, ఉదయభాను, ఛార్మి పేర్లు వినిపిస్తున్నాయని వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!