మోహన్ బాబు 40 ఏళ్ల తర్వాత మళ్లీ...

Published : Mar 06, 2019, 12:05 PM IST
మోహన్ బాబు 40 ఏళ్ల తర్వాత మళ్లీ...

సారాంశం

హీరో,విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ .. ఏ పాత్రని అయినా తనదైన వాయిస్ తో  అవలీలగా పరకాయప్రవేశం చేసి ఆకట్టుకునే  నటుడు మోహన్‌బాబు. ఆయన కెరీర్ లో ఎక్కువ శాతం తెలుగు సినిమాలే చేసారు. 

హీరో,విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ .. ఏ పాత్రని అయినా తనదైన వాయిస్ తో  అవలీలగా పరకాయప్రవేశం చేసి ఆకట్టుకునే  నటుడు మోహన్‌బాబు. ఆయన కెరీర్ లో ఎక్కువ శాతం తెలుగు సినిమాలే చేసారు. అయితే తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసారు. అయితే అది నలభై సంవత్సరాల క్రితం వ్యవహారం. అయితే ఆయన చాలా కాలం తర్వాత తమిళంలో ఓ సినిమా కమిటయ్యారు.  ‘గురు’ (2017) డైరెక్టర్‌ గా పరిచయమైన సుధా కొంగర ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. 

వెంకటేశ్‌ హీరోగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ తెలుగమ్మాయి కావటంతో మోహన్ బాబు టాలెంట్ ఏంటనేది ఆమెకు తెలుసు. ఆమె త్వరలో తమిళ స్టార్ హీరో సూర్య తో  ఓ చిత్రం చేయడానికి  రెడీ అవుతోంది. కథ రాసుకునేటప్పుడు సినిమాలో కీ రోల్  మోహన్‌బాబు చేస్తే బాగుంటుందని ఆమె భావించారట. 

కథ విన్న హీరో సూర్య కూడా మోహన్‌బాబు అయితే న్యాయం జరుగుతుందని భావించారట. ఇటీవల మోహన్‌బాబుకు సుధ కథ చెప్పడం, ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయని సమాచారం. ఇప్పటివరకూ కనిపించన విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా సక్సెస్ అయితే తమిళంలో మళ్లీ మోహన్ బాబు హవా స్టార్ట్ అవుతుందంటున్నారు మంచు అభిమానులు. మంచిదేగా. 

PREV
click me!

Recommended Stories

Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?