Curry and Cyanide : ఓటీటీలో సెన్సేషన్ గా ‘కర్రీ అండ్ సైనైడ్’.. వణుకుపుట్టిస్తున్న రియల్ క్రైమ్ స్టోరీ.. డిటేల్

By Nuthi SrikanthFirst Published Jan 4, 2024, 9:12 PM IST
Highlights

ఓటీటీలో రీసెంట్ గా విడుదలైన రియల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్ Curry and Cyanide డాక్యుమెంటరీ సెన్సేషన్ గా మారింది. గతనెల నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 

వెండితెరపైకి వచ్చే సినిమాలకు ధీటుగా ఓటీటీ మూవీస్, సిరీస్ లు, ఇటీవల డాక్యుమెంటరీలు కూడా వస్తున్నాయి. కంటెంట్ లో దమ్ము చూపిస్తూ ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ‘ధూత’ వెబ్ సీరిస్ టాప్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పటికీ మంచి వ్యూస్ ను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ చూపంతా ఓ రియల్ క్రైమ్ స్టోరీపైనే ఉంటోంది. 

జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు క్రిస్టో టామీ రూపొందించిన రియల్ క్రైమ్ స్టోరీ Curry and Cyanide ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. 2023 డిసెంబర్ 22 నుంచి ఈ డాక్యుమెంటరీ ఆడియెన్స్ కు అందుబాటులో ఉంది. ఇందులో రెమో రాయ్, రోజో థామస్, రెంజి విల్సన్, కె.జి. సైమన్, జాలీ జోసెఫ్, మేఘన శ్రీవాస్తవ్, నిఖిలా హెన్రీ, సి.ఎస్ చంద్రిక, బి.ఏ అలూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇండియా టుడే ఒరిజినల్స్ ప్రొడక్షన్ లో వచ్చింది. 

Latest Videos

ప్రస్తుతం ఓటీటీలో ఈ డాక్యుమెంటరీకి వ్యూయర్ షిప్ పెరుగుతోంది. కేరళలోని జాలి జోసెఫ్ కేసు ఆధారంగా చిత్రీకరించిందే ఈ డాక్యుమెంటరీ. ఒక మహిళ రియల్ లైఫ్ లో ఆరు హత్యలను చేయడం, అందుకు గల కారణాలు, ఒంట్లో వణుకుపుట్టించే సన్నివేశాలకు అంతా షాక్ అవుతున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులను తినే ఆహారంలో సైనైడ్ కలిసి హత్యలు చేస్తుంటుంది. కనికరం లేకుండా ఒక్కొక్కరిని చంపుతూ పోతోంది. ఇంతకీ ఎందుకు చంపుతుందనేది ఆసక్తికరంగా మారింది. 2022లో తెరపైకి వచ్చిన ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

click me!