Bigg Boss Telugu 10: పులిచర్మం కప్పుకున్న నక్కవి.. త్రిగుణ్ సంచలన కామెంట్స్, కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపించిన మాజీలు..

Published : Nov 17, 2026, 11:01 PM IST
Bigg Boss Telugu 10

సారాంశం

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఇంట్లో ముఖ్యంగా నామినేషన్లు టైం వచ్చే సరికి బిగ్ బాస్ హౌస్ వార్ ప్లేస్ ను తలపిస్తోంది. ఈ వారం మరింత డోస్ పెంచి.. మాజీ కంటెస్టెంట్స్ ను కూడా రంగంలోకి దింపాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ వారం నామినేషన్ల ప్రక్రియ మాజీ కంటెస్టెంట్ల ఎంట్రీతో మరింత ఉత్కంఠభరితంగా మారింది. ‘డిక్టేటర్స్’ కాన్సెప్ట్‌తో ఇంట్లోకి అడుగుపెట్టిన మాజీ సభ్యులు, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ఆటతీరును ప్రశ్నిస్తూ ప్రస్తుత కంటెస్టెంట్లకు చుక్కలు చూపించారు. సోమవారం నాటి ఎపిసోడ్‌లో అపూర్వ, షాలినీ, మిథిలేష్, దక్షి, ఝాన్సీ ఇంట్లోకి రాగా, 72వ రోజు ఎపిసోడ్‌లో శ్రష్టి వ్యాకరణం, చరణ్, శ్వేత ఎంట్రీ ఇచ్చి నామినేషన్ల ప్రక్రియను తుది అంకానికి తీసుకెళ్లారు.

ఆర్కే, వర్షిణిపై శ్రష్టి వ్యాకరణం సూటి ప్రశ్నలు

72వ రోజు ఎపిసోడ్‌లో ఇంట్లోకి వచ్చిన శ్రష్టి వ్యాకరణం, అడుగుపెట్టిన వెంటనే ఆర్కేపై కౌంటర్ వేసింది. “ఆర్కే ఎలా ఉన్నావ్.. నువ్వు, ఆ లెటర్ బాక్స్ రెండూ ఒకేలా ఉన్నారు” అంటూ ఇంట్లో అతడి ఉనికి, ఆటతీరు లేకపోవడాన్ని ఎత్తిచూపింది. ఆ తర్వాత వర్షిణిని నామినేట్ చేస్తూ ఆమె ఆటపై నిలదీసింది. ముకేష్‌తో కలిసి ఉండటం వల్ల వర్షిణి వ్యక్తిత్వం కనిపించడం లేదని, ఆమె వాడే ‘ఉమెన్ కార్డ్’ కూడా సరిగా లేదని శ్రష్టి విమర్శించింది. ఆత్మవిశ్వాసం లోపించి, ఎప్పుడూ సంకోచంతోనే ఉంటున్నావని పేర్కొంది.

దీనికి బదులుగా అబ్బాయిలతో పోటీ పడే శక్తి తనకు లేదని వర్షిణి సమాధానమిచ్చింది. అయితే ఇప్పటివరకు ఒక్క టాస్క్ అయినా గెలిచావా అని శ్రష్టి ప్రశ్నించగా, ముకేష్‌తో కలిసి ఆడిన పజిల్ టాస్క్ గురించి త్రిగుణ్ ప్రస్తావించాడు. మరోవైపు అమన్ నుంచి కెప్టెన్సీ తీసుకోవడం తనకు నచ్చలేదని శ్రష్టి చెప్పగా, తాను కెప్టెన్సీ రేసులో ఉన్నా సపోర్ట్ చేయాలనే ఆలోచన రాలేదని అమన్ అసహనం వ్యక్తం చేశాడు. కానీ అమన్‌కు మద్దతు ఇస్తానని శ్రష్టి చెప్పిందని ఆర్కే సాక్ష్యం చెప్పడంతో, వర్షిణి, ముకేష్ కలిసి అమన్‌ను టార్గెట్ చేశారు. తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానని భావిస్తున్నారని వర్షిణి అడగ్గా, ఇమ్యూనిటీ రేసులోకి రానివ్వకపోవడం వల్లే బయటకు వచ్చానని శ్రష్టి స్పష్టం చేసింది. కంటెంట్ కోసం వాడుకున్నప్పుడు గుర్తురాలేదా అని ముకేష్ ప్రశ్నించగా, అప్పుడు గ్రూపులో లేడనే కారణంతోనే నవ్వారని శ్రష్టి తిప్పికొట్టింది.

త్రిగుణ్ డప్పు, పాటతో ముకేష్‌కు కౌంటర్

శ్రష్టి తన డ్యాగర్‌ను త్రిగుణ్‌కు ఇవ్వగా, అతడు ముకేష్‌ను నామినేట్ చేశాడు. ఈ నామినేషన్‌ను త్రిగుణ్ డప్పు కొడుతూ, పాట పాడుతూ నామినేషన్ చేయడం ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా నిలిచింది. ఎదుటివారి ఓటమిలో ఆనందం వెతుక్కునే వ్యక్తికి అర్హత లేదని, “నక్కకు పులి చర్మం వేసుకుంటే పులి అవ్వదు.. మేకప్ వేసుకుంటే లోపలి మురికి బయటకు పోదు” అంటూ ముకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. “మూర్ఖుడంటే మూర్ఖుడు.. మబ్బులోన మూర్ఖుడు.. కల్లు తాగిన కోతిలాగా కుళ్లుకుంటాడు” అంటూ పాట రూపంలో చురకలంటించాడు.

చరణ్, శ్వేత రాకతో ముగిసిన నామినేషన్ల ఘట్టం

నామినేషన్ల చివరి దశలో చరణ్, శ్వేత ఇంట్లోకి ప్రవేశించారు. “నేను పని చేసిన ఇల్లు.. నన్ను గెంటేసిన మనుషులు” అంటూ చరణ్ సరదాగా వ్యాఖ్యానించినప్పటికీ, ఆ తర్వాత పాయింట్లతో నిలదీశాడు. ఆటలో ఒక అడుగు ముందుకు వేస్తుంటే మాటలు రెండు అడుగులు వెనక్కి లాగుతున్నాయని, “చరణ్ ఓ బచ్చాగాడు” అని అన్నావని త్రిగుణ్‌పై చరణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే షాలినీ ఉంటుందా, చరణ్ ఉంటాడా అని అడిగినప్పుడు ‘చరణ్ ఏం ఆడిండు రా’ అన్నట్టుగా పెట్టిన ఎక్స్‌ప్రెషన్ తనను బాధించిందని చెప్పాడు. చరణ్ అమన్‌పై పాయింట్లు చెప్పగా, శ్వేత నేరుగా రాం ప్రసాద్‌ను నామినేట్ చేసింది. “నీకు నేను ఏమైనా ద్రోహం చేశానా? నీ ఆటలో నిన్ను వెనక్కి లాగానా?” అంటూ ఆమె ప్రశ్నించింది.

రాం ప్రసాద్, శివ్, అమన్ వాదనలు

రాం ప్రసాద్ మాట్లాడుతూ, కాసేపు ముకేష్‌తో, కాసేపు త్రిగుణ్‌తో ఉంటూ మధ్యలో ఊగిసలాడవద్దని, అటైనా ఇటైనా ఒకవైపు ఉండాలని సూచించాడు. తాను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా షాలినీకే ఓటు వేశావని అమన్ గుర్తుచేశాడు. ఈ క్రమంలో రాం ప్రసాద్ శివ్‌ను, అమన్ త్రిగుణ్‌ను నామినేట్ చేశారు. ఇంట్లో తనను ఎక్కువగా బాధపెట్టింది త్రిగుణే కాబట్టి ప్రతీకారంతో పేరు పెట్టానని శివ్ చెప్పగా, అంత కోపం ఉంటే నన్ను కాకుండా అతడినే నామినేట్ చేయాలి కదా అని ఆర్పీ ప్రశ్నించాడు. ఎవరిని నామినేట్ చేయాలన్నది తన ఇష్టమని శివ్ బదులిచ్చాడు. మరోవైపు త్రిగుణ్ తనకు కెప్టెన్సీ ఇస్తాడో లేక వెనకాల నుంచి పొడుస్తాడో తెలియని గందరగోళంలో ఉన్నానని అమన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

11వ వారం నామినేషన్ల చిత్రం, డబుల్ ఎలిమినేషన్ చర్చ

చరణ్, శ్వేత ఇచ్చిన డ్యాగర్లతో 11వ వారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే కెప్టెన్ నరేష్, ఆర్కే మినహా మిగిలిన కంటెస్టెంట్లంతా నామినేషన్లలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. మాజీ కంటెస్టెంట్ల ప్రశ్నలకు ప్రస్తుత సభ్యులు ఇచ్చిన సమాధానాలు, పాత వివాదాల తో 72వ రోజు ఎపిసోడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Swetha Naidu Remuneration: 5 వారాలకు శ్వేత నాయుడు బిగ్‌ బాస్‌ పారితోషికం ఇదే.. గట్టిగానే కొట్టిందిగా