Bigg Boss Telugu 10: సుధీర్ సున్నా, ముకేష్ కాదు మబ్బేష్, తన చెంపపై తానే కొట్టుకున్న నీతు, నామినేషన్స్‌లో తారస్థాయికి రచ్చ

Published : Nov 09, 2026, 11:10 PM IST
Bigg Boss Telugu 10 Day 64 Sudheer and Mukesh Clash Neethu Harms Herself

సారాంశం

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో వారం నామినేషన్ ప్రక్రియతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. నామినేషన్లు చూసేసరికి.. ఈ వారం ఆట మరింత రసవత్తరంగా, వివాదాస్పదంగా మారుతుంది.

సుధీర్ - ముకేష్ మధ్య సమరం

మొదటి వారాల నుంచి మంచి స్నేహితులుగా, ఒకే గ్రూపులో కొనసాగిన సుధీర్ ,ముకేష్‌ల మధ్య ఇప్పుడు దూరం పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. గతంలో సుధీర్ కోసం ముకేష్ తన పవర్ ఉపయోగించుకున్న విషయాన్ని ముకేష్ పదే పదే గుర్తుచేస్తూ సుధీర్‌ను కార్నర్ చేస్తున్నాడు. "నేను లేకపోతే నువ్వు కెప్టెన్‌వి కాకపోగా, కనీసం కంటెండర్‌గా కూడా అర్హుడవు కావు" అంటూ ముకేష్ చేసిన వ్యాఖ్యలు సుధీర్ పర్సనాలిటీని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ విషయంలో సుధీర్ - శివ ఇద్దరు తీవ్రంగా స్పందించారు. "ముకేష్ గుండు సున్నా" అని సుధీర్ కౌంటర్ ఇవ్వగా, శివ్ సైతం ముకేష్‌ను మబ్బేష్ అంటూ ఎద్దేవా చేశారు. వర్షిణి కూడా ముకేష్, సుధీర్ వ్యవహారంపై స్పందిస్తూ వారి మధ్య బంధాలు తల్లకిందులైనట్లు చూపించారు.

కంట్రోల్ తప్పిన నీతూ.. ఏం చేసిందంటే?

నామినేషన్ల హీట్‌లో కంటెస్టెంట్లు హద్దులు మీరుతున్న తరుణంలో నీతూ ప్రవర్తన ప్రధాన చర్చనీయాంశమైంది. త్రిగుణ్, వంశీలతో నామినేషన్ పాయింట్ల గురించి వాదిస్తున్న సమయంలో ఆమె తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. తన ఫ్యామిలీ, కష్టాల గురించి మాట్లాడినప్పుడు సహనం కోల్పోయిన నీతూ, తనను తాను చెంప మీద కొట్టుకుంటూ శారీరకంగా బాధించుకోవడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్‌లో తనని తాను హర్ట్ చేసుకోవడం నిషిద్ధం గతంలో వంశీ ఇలాగే తనని తాను కొట్టుకున్నప్పుడు హోస్ట్ నాగార్జున తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నీతూ కూడా అదే తరహాలో ప్రవర్తించడం పట్ల వీకెండ్‌లో నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.

నరేష్, శ్వేత కూడా తగ్గలేదు..

ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా నరేష్ , శ్వేతలు నీతూ ఆట తీరును ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించారు. స్యాక్ గేమ్‌లో నీతూ వంశీని కొట్టిందనే పాయింట్‌ను నరేష్ ప్రస్తావించగా, నీతూ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ వారం నామినేషన్లు కేవలం మాటలకే పరిమితం కాకుండా మానసిక ఒత్తిడిని, శారీరక ఆవేశాలను దాటి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హౌస్‌లోని ఈ పరిణామాలు రానున్న రోజుల్లో సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు